1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. PoK youth crosses LoC after social media romance, apprehended by Army

ఆన్‌లైన్ ప్రియురాలి కోసం సరిహద్దు దాటిన పీవోకే యువకుడు

indopak border
పాకిస్థాన్‌కు చెందిన ఓ యువకుడు ఇండో పాక్ సరిహద్దును దాటారు. ఆన్‌లైన్ ప్రియురాలి కోసం ఈ సాహసానికి పాల్పడ్డారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని ముజఫర్‌బాద్‌కు చెందిన అహ్మద్ మీర్ (22) అనే యువకుడుని భద్రతా సిబ్బంది లైన్ ఆఫ్ కంట్రోల్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మంగళవారం ఉదయం 9.30 గంటల సమయంలో సైనికులు గమనించి అదుపులోకి తీసుకున్నారు. 
 
అతనివద్ద జరిపిన ప్రాథమిక విచారణలో తన వద్ద ఉన్న పాకిస్థాన్ గుర్తింపు కార్డును చూపించాడు. యూరీకి చెందిన ఇరమ్ బానో అనే యువతితో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడిందని, ఆమెను కలిసేందుకే ఇక్కడికి వచ్చానని జీషాన్ తెలిపాడు. జీషాన్ చెబుతున్న విషయాలను భద్రతా ఏజెన్సీలు నిర్ధారించుకుంటున్నాయి. ప్రస్తుతం జీషాన్‌తో పాటు సదరు యువతిని కూడా అధికారులు విచారిస్తున్నారు. వారిద్దరి మధ్య జరిగిన కమ్యూనికేషన్, వారి నేపథ్యంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రేమకథ నిజమేనా? లేక దీని వెనుక మరేదైనా కుట్ర ఉందా? అనే కోణంలో భద్రతా బలగాలు ఆరా తీస్తున్నాయి. 
 
ఇదిలావుంటే, నియంత్రణ రేఖ వద్ద మరో ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. హత్లంగా - నంబ్లా ప్రాంతంలో ముగ్గురు యువకులు పీవోకేలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా సైన్యం వారినిపట్టుకుంది. పట్టుబడిన వారిని సోపోర్‌కు చెందిన ఆదిల్ హుస్సేన్ దార్, ఇష్ఫాక్ అహ్మద్, జాఫర్ అహ్మద్‌లుగా గుర్తించారు. వీరిలో ఆదిల్ హుస్సేన్ గతంలో టెరిటోరియల్ ఆర్మీ (టీఏ-161)లో పనిచేసి సస్పెండ్ అయినట్లు అధికారులు తెలిపారు. నిఘా సమాచారం ఆధారంగా సైన్యం వీరిని సరిహద్దుకు చేరుకోకముందే అడ్డుకుంది. వారి ఉద్దేశం ఏంటి, ఏదైనా ఉగ్రవాద నెట్‌వర్క్‌తో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మమతా బెనర్జీకి 60 మంది ఎమ్మెల షాక్... బీజేపీలో చేరుతారా?