1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Priest Behaves Indecently Towards Women at Varanasi Ganga Ghat, He Jumps into the Ganga River, viral video

వారణాసి గంగా ఘాట్‌లో మహిళలపై పూజారి అసభ్య ప్రవర్తన, గంగలో దూకేశాడు, వీడియో

women beat Pujari
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి గంగా ఘాట్ వద్ద మహిళా భక్తులపై ఓ పూజారి అసభ్యంగా ప్రవర్తించినట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు మహిళలు పూజారిని పట్టుకుని చితకబాదుతున్నారు. ఒక మహిళ అయితే అతడి చేతిని పట్టుకుని గట్టిగా కొరుకుతోంది. తమ పట్ల పూజారి అసభ్యంగా ప్రవర్తించాడంటూ వారు ఆరోపిస్తున్నారు.
 
తాము గంగానదిలో పడవపై వెళుతున్న సమయంలో కదులుతున్న పడవలోనే తమ దుస్తులను లాగుతూ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ చిరిగిపోయిన తమ వస్త్రాలను చూపిస్తున్నారు. పూజారిపై ఆ ఇద్దరు మహిళలు తిరగబడటంతో అతడు పడవ నుంచి గంగా నదిలో దూకేసి ఈత కొట్టుకుంటూ వెళ్లిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పూజారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. 
 
తర్వాతి కథనం
పదిహేను నూతన నగరాలకు తమ ప్రీమియం సేవా కేంద్రాలను విస్తరించిన షావోమీ