1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Prime Minister Narendra Modi has only two minutes of spare time; India is on the way of global power

Narendra Modi, ప్రధాని మోడీ టైంపాస్ చేసే సమయం 2 నిమిషాలే, ప్రపంచంలో హిందుస్థాన్ శక్తి

Narendra Modi
ప్రపంచంలో హిందుస్థాన్ మరింత శక్తివంతంగా వుందంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోడి (Narendra Modi) వల్లనేనంటూ ఇప్పటికే ఎంతోమంది నాయకులు చెప్పారు. అదేవిధంగా ప్రస్తుతం నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీక్ పైన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బొద్దింక జనతా పార్టీ(CJP) చేస్తున్న ఆందోళన నేపధ్యంలో మరోసారి సోషల్ మీడియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడి గురించిన పాత వీడియోలు వైరల్ అవుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడిని ప్రశంసించిన వ్యాఖ్యల తాలూకు వీడియో ఒకటి వైరల్ అవుతోంది. 
 

ప్రధాని టైంపాస్ 2 నిమిషాలే...

ఆయన ఆ వీడియోలో మాట్లాడుతూ... తనకు బంధువైన ఒకరు ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేస్తుంటారనీ, ఆయనను ఓ సందర్భంలో ప్రధాని మోడీ గారికి టైంపాస్ ఏమిటి అని అడిగాను. ఉదయం తొమ్మిదిన్నర నుంచి 10 గంటల మధ్య టీ తాగేందుకు ప్రధాని 2 నిమిషాలు అలా బైటకు వస్తారని, అదే ఆయన టైంపాస్ అంటూ వెల్లడించారు. ప్రపంచంలో హిందుస్థాన్ శక్తి ఎంతటిదో చాటిచెబుతున్న నాయకుడు ఆయన అంటూ ప్రశంసించారు. ఈ సందర్భంగా మన ప్రధానమంత్రి మోడి దినచర్య ఎలా గడుస్తుందో తెలుసుకుందాము.
 

తెల్లవారు జామున 4 గంటలకే నిద్ర లేస్తారు

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అనుసరిస్తారు. సుదీర్ఘ పని వేళలు చేస్తుంటారు. ఆయన దినచర్య సాధారణంగా తెల్లవారుజామున ప్రారంభమై అర్ధరాత్రి వరకు సాగుతుంది. ప్రధాని ప్రతిరోజూ తెల్లవారుజామున 4:00 గంటలకు నిద్రలేస్తారు. నిద్రలేచిన వెంటనే యోగాసనాలు, ప్రశాంతమైన వాతావరణంలో ధ్యానం, సూర్య నమస్కారాలు చేస్తారు. కొద్దిసేపు ఉదయం నడక పూర్తి చేసి, రోజంతా చురుగ్గా ఉండటానికి కావలసిన మానసిక, శారీరక శక్తిని పొందుతారు.
 

ముఖ్యమైన ఇమెయిళ్ల పరిశీలన

ఉదయం 7:00 నుంచి 9:00 మధ్య సాధారణ అల్పాహారం తీసుకుంటారు. అల్లం టీతో పాటు గుజరాతీ లేదా సౌత్ ఇండియన్ శైలిలో తేలికపాటి ఉప్మా, ఖాక్రా వంటి అల్పాహారాన్ని తీసుకుంటారు. అల్పాహారం తీసుకుంటూనే వివిధ జాతీయ, అంతర్జాతీయ వార్తాపత్రికలను తిరగేస్తారు. ముఖ్యమైన ఇమెయిళ్లు, దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపై అధికారులు ఇచ్చే ముఖ్యాంశాలను పరిశీలిస్తారు.
 

రాత్రి 8 గంటల వరకూ ఆఫీసులోనే..

ఉదయం 9:00 గంటలకు ప్రధాని కార్యాలయానికి వచ్చి రాత్రి 8:00 గంటల వరకూ పనిచేస్తారు. ఉదయం 9:00 గంటలకు సౌత్ బ్లాక్‌లోని PMO (ప్రధాని కార్యాలయం) లేదా తన నివాసంలోని ఆఫీసుకు చేరుకుంటారు. కేంద్ర కేబినెట్ సమావేశాలు, వివిధ శాఖల అధికారులతో సమీక్షలు, విదేశీ దౌత్యవేత్తలతో భేటీలు నిరంతరం జరుగుతాయి. పర్యటనలు, బహిరంగ సభలు లేదా వర్చువల్ సమావేశాల్లో పాల్గొంటారు.
 

సాత్విక ఆహారమే భోజనం...

ఆయన సంపూర్ణ శాకాహారి. సాధారణంగా గుజరాతీ శైలి పప్పు, ఖిచ్డీ, కఢీ, ఆకుకూరలతో కూడిన సాత్విక ఆహారాన్ని ఇష్టపడతారు. నవరాత్రుల సమయంలో ఆయన 9 రోజుల పాటు కఠినమైన ఉపవాస దీక్ష పాటిస్తారు. రాత్రి 8:00 గంటలకు పని పూర్తయితే వెళతారు, లేదంటే ముఖ్యమైన ఫైళ్ల పరిశీలన అర్థరాత్రి 1 గంట వరకూ చూస్తారు. రాత్రి వేళల్లో ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేయడం, కొత్త పథకాల పురోగతిని సమీక్షించడం చేస్తారు.  రాత్రి భోజనం తర్వాత తనకు వచ్చిన ప్రధానమైన ఇమెయిల్స్ పరిశీలించి, అవసరమైన వాటికి ప్రత్యుత్తరాలు ఇస్తారు.  
 

నిద్రపోయేది 4 గంటలే...

అర్ధరాత్రి 1:00 గంట దాటిన తర్వాత నిద్రకు ఉపక్రమిస్తారు. ఆయన రోజుకు కేవలం 3.5 నుండి 4 గంటలు మాత్రమే నిద్రపోతారు. నరేంద్ర మోదీ ప్రతిరోజూ దాదాపు 16 నుండి 18 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తూ, యోగా, క్రమశిక్షణతో కూడిన ఆహార నియమాల ద్వారా తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు.

 
About Writer
డా|| యిమ్మడిశెట్టి వెంకటేశ్వర రావు
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
గోదావరి పుష్కరాలు.. మునికుడలి మోడల్ సక్సెస్.. పవన్ కల్యాణ్