మన విద్యార్థులకు ఇలా ఎందుకు జరుగుతోంది? రాహుల్ గాంధీ
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ 7.5 కోట్ల మంది విద్యార్థులు, వారి కుటుంబాలు ప్రభావితమయ్యారని పేర్కొన్నారు. నీట్ అభ్యర్థుల కుటుంబాలు దీని కోసం చేసిన మొత్తం ఖర్చు రూ. 1.3 లక్షల కోట్లు ఉంటుందని, ఇది దాదాపు భారతదేశ విద్యా బడ్జెట్‌కు సమానమని ఆయన తెలిపారు.
"మన విద్యార్థులకు ఇలా ఎందుకు జరుగుతోంది? పోలీసులు వారిని కొట్టడానికి, వారిపై తుపాకులు గురిపెట్టడానికి వారు చేసిన తప్పేంటి?" అని రాహుల్ ప్రశ్నించారు. దేశ విద్యార్థులుగా తమకు న్యాయబద్ధమైన విద్యా విధానం లభించాలని, కానీ ప్రస్తుతం అది లేదు. పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు విద్యార్థులు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు, పైగా పరీక్షకు చివరి నిమిషంలో ప్రశ్నపత్రం లీక్ అయిందని వారికి చెప్తున్నారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా విధానాలలో ఒకటిగా పేరుగాంచిన మన విద్యా వ్యవస్థ ఇప్పుడు అక్రమాలకు నిలయంగా మారిందన్న విషయం అందరికీ స్పష్టంగా తెలుసునని ఆయన అన్నారు. 152 పరీక్షా పత్రాల లీక్‌లు, ఒక్కరికీ శిక్ష పడలేదు, గత దశాబ్ద కాలంలో మొత్తం 152 సార్లు పరీక్షా పత్రాలు లీక్ అయ్యాయని రాహుల్ గాంధీ వెల్లడించారు. లెక్కించి చూస్తే ఇది నెలకు ఒక లీక్ అవుతుందని చెప్పారు.
