గురువారం, 19 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 జనవరి 2026 (14:35 IST)

అమృత్ భారత్ రైళ్లలో ఆర్ఏసీ రద్దు.. ఇక కేవలం బెర్తులు మాత్రమే కేటాయింపు

amrit bharat 2
దేశంలో త్వరోలోనే పట్టాలెక్కనున్న అమృత్ భారత్ రైళ్ల సీట్ల కేటాయింపు విషయంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య, మధ్యతరగతి ప్రయాణికుల కోసం ఈ రైళ్లను కేంద్ర రైల్వే శాఖ ప్రవేశపెడుతున్న విషయం తెల్సిందే. ఈ నెలలో పట్టాలెక్కనున్న అమృత్ భారత్-2 రైళ్లలో టిక్కెటింగ్ నిబంధనలను సవరించింది. ఇందులోభాగంగా, స్లీపర్ క్లాస్‌లో రిజర్వేషన్ ఎగైనెస్ట్ క్యాన్సిలేషన్ (ఆర్ఏసీ) విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇకపై ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు కేవలం కన్ఫర్మ్ బెర్తులను మాత్రమే కేటాయిస్తారు. 
 
ఈ కొత్త నిబంధన ప్రకారం అమృత్ భారత్ 2 రైళ్లలో కనీస ప్రయాణ దూరానికి చార్జీల విధానాన్ని కూడా రైల్వే బోర్డు సవరించింది. సెకండ్ క్లాస్‌లో కనీస 50 కిలోమీటర్ల దూరానికి చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. దీనికి కనీస బేస్ చార్జీని రూ.36గా నిర్ణయించారు. అలాగే, స్లీపర్ క్లాస్‌లో కనీస చార్జీ దూరాన్ని 200 కిలోమీటర్లుగా నిర్ధారించారు. దీనికి కనీస బేస్ ఫేర్ రూ.149గా ఉంటుంది. ప్రయాణ దూరం ఇంతకంటే తక్కువగా ఉన్నప్పటికీ ఈ కనీస చార్జీని తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. 
 
ప్రయాణికులకు ఆర్ఏసీ బెర్తులపై ఉండే అనిశ్చితిని తొలగించి, బుకింగ్ నుంచే కన్ఫార్మ్ బెర్తు టిక్కెట్లు జారీ చేయాలన్న లక్ష్యంతో ఈ మార్పులు చేసినట్టు రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ బేస్ ఫేర్‌కు రిజర్వేషన్ చార్జీ, సూపర్ ఫాస్ట్ చార్జీ వంటి ఇతర రుసుములు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఫుష్ పుల్ టెక్నాలజీతో నడిచే ఈ రైళ్లు తక్కువ ప్రయాణ సమయంలో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా, మెరుగైన ప్రయాణ సౌకర్యాలను అందించనున్నాయి.