1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Rajinikanth Suddenly Meets Stalin as Vijay Stands Poised to Form Government, A Stirring Development

విజయ్ ప్రభుత్వ ఏర్పాటు యత్నం, రజినీకాంత్ అకస్మాత్తుగా స్టాలిన్‌ను కలిశారు, ఎందుకని?

Rajinikanth and Stalin
నటుడు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమవుతున్న తరుణంలో, డీఎంకే నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఆయన నివాసంలో నటుడు రజినీకాంత్ కలవడం సంచలనం సృష్టించింది.
 
ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే 108 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి టీవీకేకి 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం కాగా, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీంతో విజయ్‌కు మరో 5 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. టీవీకేకి మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం కావడంతో, టీవీకె చిన్న పార్టీలకు లేఖలు రాశారు.
 
ఎమ్మెల్యేల మద్దతు లేఖలను సమర్పించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తనను ఆహ్వానించాలని కోరుతూ విజయ్ గవర్నర్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఐతే తగిన బలం లేకుండా ప్రభుత్వ ఏర్పాటు ఎలాగంటూ గవర్నర్ ప్రశ్నించినట్లు సమాచారం. పూర్తి బలంతో తనవద్దకు రావాలని, శుక్రవారం వరకూ సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు తమిళనాడు రాజకీయాలు ఉద్రిక్త పరిస్థితుల్లో కొనసాగుతున్న తరుణంలో, నటుడు రజనీకాంత్ స్టాలిన్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది.
 
అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ కొలత్తూరు నియోజకవర్గంలో ఓడిపోయారు. అది కూడా, ఆయన టీవీకె అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. అందువల్ల, రజనీకాంత్ ఆయనను ఓదార్చడానికి కలిశారని చెబుతున్నారు.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
విజయ్‌ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వండి, బలం గవర్నర్ వద్ద కాదు, అసెంబ్లీలో చూపించుకోవాలి: స్టాలిన్