1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Rights Denied : Vijay Targets DMK As He Withdraws Cases Against Farmers, Teachers

రైతులు - టీచర్లను అమానవీయంగా చూశారు.. కేసులు ఎత్తేస్తాం : సీఎం విజయ్

Tamil Nadu CM Vijay
డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే పార్టీపై తమిళనాడు సీఎం విజయ్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన రైతులు, ఉపాధ్యాయుల పట్ల అమానవీయంగా ప్రవర్తించారని ఆరోపించారు. గత ప్రభుత్వం వారిపై పెట్టిన కేసులను పూర్తిగా ఎత్తివేస్తామని విజయ్‌ ఈ సందర్భంగా ప్రకటించారు. అసెంబ్లీలో సమావేశాల్లో భాగంగా సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు.
 
'మే 2021- 2026 మధ్య సిప్కాట్ పారిశ్రామిక అభివృద్ధి, పరందూర్ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన రైతులు, ఉపాధ్యాయులపై అనేక కేసులు నమోదయ్యాయి. అవి ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్లే ఆ కేసులను ఎత్తివేయాలని నిర్ణయించుకున్నాం. మా ప్రభుత్వం రైతులు, ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లకు అండగా నిలుస్తుంది. ఇటువంటి చర్యల వల్ల సామాన్య ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది' అని విజయ్‌ పేర్కొన్నారు.
 
మరోవైపు, ఇటీవల నీట్‌ పరీక్షకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విద్యార్థులు, ఆందోళనకారులపైనా కేసులను ఉపసంహరించుకోవాలని సీపీఐ పార్టీ విజయ్‌ని కోరింది. అటు, నెయ్వేలి లిగ్నైట్ కార్పొరేషన్ (ఎన్‌ఎల్‌సి)కు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపై నమోదు చేసిన కేసులను వెనక్కి తీసుకోవాలని పీఎంకే విజ్ఞప్తి చేయడం గమనార్హం. అయితే, దీనిపై ముఖ్యమంత్రి విజయ్ ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
కర్నాటక రైతు బిడ్డకు రూ.46.33 లక్షల వీసా ఉద్యోగ ఆఫర్