Say No To Trisha, ఎక్స్‌లో ట్రెండ్ అవుతున్న నటి త్రిష పేరు, ఎందుకని?
తమిళనాడుకి సంబంధించిన SayNoToTrisha అనే హ్యాష్ ట్యాగ్ ఎక్స్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దీనికి కారణం ఏంటన్నది కూడా తమిళజనం మాట్లాడుకుంటున్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు త్రిషను ఆహ్వానించడం ఒక ఎత్తయితే ఆమె వెళ్లి నేరుగా సీఎం విజయ్ తల్లిదండ్రుల పక్కనే ఆశీనురాలు కావడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. స్పెషల్ గెస్టుగా ఆహ్వానిస్తే ఆహ్వానించివుండవచ్చు కానీ ఆమె అలా వారి పక్కనే కుటుంబసభ్యురాలిగా ఎలా కూర్చుందంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
త్రిష మాత్రం సీఎం విజయ్ జాతీయ పతాకావిష్కరణను ఎంతో సంతోషంతో తిలకించింది. వాహనంపై విజయ్ వెళ్తుండగా తన సెల్ ఫోనులో వీడియో తీసుకున్నది. తన సీటుకి పక్కగా వెళ్లేవారిని పలుకరిస్తూ నవ్వుతూనే వుంది. ఐతే ఆమె పక్కనే కూర్చున్న విజయ్ తల్లిదండ్రులు మాత్రం ఆమెను ఎంతమాత్రం పట్టించుకున్నట్లు కనిపించకపోవడం గమనార్హం. ప్రస్తుతం త్రిష స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న వీడియోలు, ఆమెపై వ్యాఖ్యలు చర్చలు జరుగుతున్నాయి.
As #SayNoToTrisha gets traction , she occupies a pride of middle seat between @TVKVijayHQ parents at Independence Day celebrations. Both of them just dont care? pic.twitter.com/uiO7p1rTYv
— PrabhuChawla (@PrabhuChawla) August 15, 2026
— Anu_21_sha (@Anu21Anushya) August 15, 2026
