1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Shocking Video: Narrow Escape For 3 As Landslide Launches Tanker Towards Them

వయనాడ్‌లో విరిగిపడిన కొండ చరియలు - వంద అడుగులు దూసుకొచ్చిన ఇంధన ట్యాంకర్ (వీడియో)

waynad landslides
కేరళ రాష్ట్రంలోని వయనాడ్‌ జిల్లా ప్రకృతి ప్రకాపానికి గురైంది. దీంతో పెను ప్రమాదం సంభవించింది. భారీగా కొండచరియలు విరిగిపడటంతో జనజీవనం అతలాకుతలమైంది. రహదారులపై ఉన్న ఒక ఇంధన ట్యాంకర్‌తో పాటు పలు వాహనాలు రెప్పపాటు కాలంలో బురద ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ భీకర ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 
 
అనక్కంపాయల్ - కల్లాడి టన్నెల్ రోడ్ ప్రాజెక్టు సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. భూమి ఒక్కసారిగా కుంగిపోవడంతో టన్నుల కొద్ది మట్టి, రాళ్లు వేగంగా కిందకు దూసుకొచ్చాయి. స్థానికులు చూస్తుండగానే ఈ ఘోరం జరిగిపోయింది. ప్రవాహ ఉధృతికి ట్యాంకర్ సుమారు 100 అడుగుల వరకు కొట్టుకొచ్చింది. అయితే, అందులోని ముగ్గురు సిబ్బంది స్వల్పగాయాలతో ప్రాణాలతో బయటపడటం ఊరటనిచ్చే అంశం.
 
ఈ ప్రకృతి వైపరీత్యంలో ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు గల్లంతయ్యారు. సుమారు 10 మంది గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. గత 24 గంటల్లో జిల్లాలో నమోదైన 265 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతమే ఈ విపత్తుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో కార్మికుల నివాసాలు, పలు వాహనాలు శిథితాల కింద చిక్కుకుపోయాయి. గల్లంతైన వారి అచూకీ కోపం సహాయక బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. 

 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కాకినాడ చిన్నారి జానుని అప్పగిస్తే కేసు లేకుండా చూస్తాం: పోలీసులు ప్రకటన