బుధవారం, 12 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 నవంబరు 2025 (20:12 IST)

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - మావోయిస్టుల హతం

Udhampur Encounter
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ జిల్లాలోని నేషనల్ పార్కు అడవుల్లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా ఆయుధ సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ వెల్లడించారు. 
 
నేషనల్‌ పార్క్‌ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు సమాచారం అందుకున్న బీజాపూర్‌, దంతెవాడ, డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌ సంయుక్త బృందం ఈ ఆపరేషన్‌ చేపట్టింది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఆటోమేటిక్ ఆయుధాలు ఇన్సాస్, స్టెన్‌గన్‌లు, 303 రైఫిళ్లు, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు  బీజాపూర్‌ ఎస్పీ జితేంద్రయాదవ్‌ తెలిపారు.
 
ఆ ప్రాంతంలో ఇంకా మావోయిస్టు కదలికలు ఉన్నట్లు తెలిసిందని, అదనపు బలగాలను అక్కడికి పంపుతున్నట్లు బస్తర్‌రేంజ్‌ ఐజీ సుందర్‌రాజ్‌ తెలిపారు. మరోవైపు గరియాబంద్‌ జిల్లాలో నాలుగు గంటలపాటు ఎదురుకాల్పులు కొనసాగాయి. ఈ కాల్పుల నుంచి మావోయిస్టులు తప్పించుకోగా.. పెద్ద ఎత్తున ఆయుధ సామగ్రిని భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నాయి.