1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Sleepless Nights for Techies: 73,000 Employees Laid Off in Just the First Three Months of 2026

టెక్కీలకు నిద్రలేని రాత్రులు, 2026 మొదటి 3 నెలల్లోనే 73,000 ఉద్యోగులు తొలగింపు

Employees Laid Off
AI. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ. కృత్రిమ మేధస్సు. కనుగొన్నదే సాఫ్ట్వేర్ ఇంజినీర్లు. ఇప్పుడదే వారికి భస్మాసుర హస్తంగా మారుతోంది. ఏదైతే కనిపెట్టారో అదే వారి ఉద్యోగాలు పోవడానికి కారణం అవుతోంది. ఈ ఏడాది 2026 మొదటి 3 నెలల అంతానికి పలు కంపెనీలు తొలగించిన ఉద్యోగులు సంఖ్య 73,000 దాటిపోయింది. మెటా మరో 8 వేల మందిపై వేటు వేసేందుకు సిద్ధంగా వున్నదని సమాచారం. ఇలా ఏ మూల చూసినా ఉద్యోగాలు చేస్తున్న టెక్కీలకు నిద్రలేని రాత్రులు అవుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో... తమ ఉద్యోగం వుంటుందా వూడుతుందా అనే భయంతో కొట్టుమిట్టాడుతున్నారు.
 
ప్రస్తుతం ఏఐ ప్రాబల్యం పెరిగిపోవడం ఒకవైపు, మధ్యఆసియాలో యుద్ధం వల్ల తలెత్తిన అనిశ్చిత మరోవైపు... వెరసి ప్రతి కంపెనీ కాస్ట్ కటింగ్ పైన యోచన చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏఐని సమర్థవంతంగా ఎవరైతే ఉపయోగిస్తున్నారో వారిని మాత్రం అట్టేపెట్టుకుని, నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోని ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించేస్తున్నారు. 
 
రాబోయే మరికొన్ని రోజుల్లో ఒరాకిల్ ఏకంగా 20 నుంచి 30 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకనున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే మెటా మే నెల చివరి నాటికి కనీసం 8 వేల మంది ఉద్యోగులకు పింక్ స్లిప్పులను ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇంకా చిన్నాచితక కంపెనీలు కలిపి కనీసం మరో 10 వేల ఉద్యోగులను తొలగించే పనిలో వున్నట్లు సమాచారం. మొత్తమ్మీద ఈ పరాభవ నామ సంవత్సరంలో టెక్కీలకు కలిసి వచ్చే కాలంగా అగుపించడంలేదు. ఎందుకంటే ఈ ఏడాది చివరి నాటికి టెక్ ఉద్యోగుల తొలగింపు 3,00,000కి చేరుకునే పరిస్థితులు వున్నాయని అంటున్నారు. మరి ఆ తర్వాత ఏమైనా పరిస్థితులు చక్కబడుతాయోమో చూడాల్సి వుంది.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
రూ.7వేల కోసం తమ్ముడు, అతని గర్భిణీ భార్యను హతమార్చాడు.. ఎక్కడ?