దేవుడుకి విశ్రాంతి లేకుండా చేస్తారా? సుప్రీంకోర్టు అసహనం
దేవుడికి విశ్రాంతి సమయాల్లో ప్రత్యేక పూజలు ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దేవుడికి కూడా విశ్రాంతి వేళలు ఉంటాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర బీహారీజీ మహరాజ్ ఆలయంలో దర్శన సమయాల మార్పుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. దేవుడికి విశ్రాంతి సమయంలో ప్రత్యేక పూజలు చేయడమేమిటని నిలదీసింది. ఇక్కడి ఆలయన దర్శన వేళలు, పూజా విధానాల్లో చేసిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై సుప్రీం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. భక్తుల నుంచి డబ్బులు తీసుకుని ప్రత్యేక పూజలు చేయడం ఏమిటని ప్రశ్నించింది.
దేవుని విశ్రాంతి వేళల్లో ప్రత్యేక పూజలు చేయడం సహమంజసం కాదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో దర్యాప్తునకు ఉన్నతస్థాయి ఆలయ నిర్వహణ కమిటీని అపెక్స్ కోర్టు నియమించింది. బాంకీ బీహారీజీ ఆలయంలో దర్శన వేళల్లోనే కాకుండా పలు మతపరమైన పూజా విధానాల్లో మార్పుల చేస్తున్నట్టు పిటిషనర్ల తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. కొన్నేళ్ళుగా వస్తున్న ఆచార సంప్రదాయం ప్రకారం దేవుడి విశ్రాంతి వేళలు ఉంటాయని, కానీ, ఆ సమయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆలయ కమిటీపై ఆగ్రహం వ్యక్తంచేసింది. దేవుడుకి విశ్రాంతి ఇవ్వకుండా ప్రత్యేక పూజలు ఏమిటని ప్రశ్నించింది. అనాదిగా వస్తున్న నియమాలను, పద్దతులను, దర్శన సమయాలను పాటించాలని ఆదేశించింది. అనంతరం ఈ కేసును జనవరి నెల మొదటి వారానికి వాయిదా వేసింది.