1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Tamil Nadu Election Result | As TN Counts Votes, Trisha Prays At Tirupati On Her 43rd Birthday

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : ట్రెండింగ్‌లో 'త్రిష' - 'జన నాయగన్'

vijay - trisha
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో విజయ్ సారథ్యంలోని టీవీకే ప్రభంజనం సృష్టిస్తోంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను ప్రభుత్వ ఏర్పాటుకు 118 స్థానాలు అవసరం కాదా... టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటు కావడం తథ్యమని తేలిపోయింది. ఈ నేపథ్యంలో హీరోయిన్ త్రిష, విజయ్ నటించి విడుదలకు నోచుకోని జన నాయగన్ చిత్రం ఇపుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. 
 
సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం సెన్సార్ వివాదం కారణంగా విడుదలకు నోచుకోని విషయం తెల్సిందే. అప్పటి నుంచి సినీ, రాజకీయ రంగాల్లో హాట్‌ టాపిక్‌గా మారిన సినిమా ఇది. విజయ్‌ హీరోగా నటించిన ఈ చిత్రం చివరి నిమిషంలో ఆగిపోవడం.. ఆ తర్వాత సోషల్‌ మీడియాలో అనుహ్యంగా లీక్‌ కావడం.. దీని వెనక రాజకీయ కుట్రలు ఉన్నాయని విజయ్‌ స్వయంగా చెప్పడంతో ఈ సినిమా ఎన్నికల ప్రచారంలోనూ కీలకమైంది. 
 
తనను అడ్డుకోలేక తన సినిమాను అడ్డుకున్నారంటూ విజయ్‌ చెప్పారు. నేడు ఆయన గెలుపు దిశగా దూసుకుపోతోన్న వేళ ఎక్స్‌లో ఈరోజు సినిమా పేరు కూడా ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. విజయ్‌ సీఎం అవడం ఖాయమంటూ అభిమానులు ఈ సినిమా ట్రైలర్‌ను పంచుకుంటూ డైలాగులను గుర్తుచేసుకుంటున్నారు.
 
మరోవైపు తన పుట్టినరోజు సందర్భంగా నటి త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో త్రిష పేరు ఎక్స్‌లో టాప్‌లో ట్రెండ్‌ అవుతోంది. 
 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
Hyderabad: కుమారుడి సాయంతో ప్రియుడిని హత్య చేసింది