ఇండియా వెళ్లేప్పుడు జాగ్రత్త అన్నారు, కానీ ఇక్కడకొచ్చి చూస్తే: విదేశీయురాలి అనుభవం
ఇండియా వెళ్లేటప్పుడు జాగ్రత్త అని నా బంధువులు, స్నేహితులు భయపెట్టారు. కానీ అవేమీ పట్టించుకోకుండా ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడంతా చూసిన తర్వాత వాళ్లు చెప్పినట్లు ఇక్కడ అలాంటివేమీ లేవని నాకనిపించింది అంటూ ఓ విదేశీ పర్యాటకురాలు తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఆమె మాట్లాడుతూ... ఇండియా వెళ్లేప్పుడు జాగ్రత్త అన్నారు. జాగ్రత్త అని వాళ్లు ఎందుకు అన్నారో నాకు తెలియదు. కానీ ఇక్కడివాళ్లు అద్భుతం. ఒక నిరుపేద వ్యక్తి తనకు వాటర్ బాటిల్ కొని ఇచ్చి దాహం తీర్చుకోండి అని చెప్పాడు. ఇక్కడ అందరూ సహాయం చేసేవారుగానే కనిపించారు. భారతదేశం చాలా అందమైన దేశం. అందరూ చాలా ఆత్మీయంగా పలుకరిస్తున్నారు. భాష గురించి నాకు అర్థం కాకపోయినా వారి చేతల్లో ఆత్మీయత వున్నది అంటూ ఆమె కితాబిచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.