శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 30 డిశెంబరు 2016 (16:36 IST)

శబరియాత్ర 600 కిలోమీటర్ల పాటు యజమానిని ఫాలో చేసిన శునకం..

శునకాన్ని విశ్వాసానికి మారు పేరుగా చెప్తారు. యజమాని పట్ల శునకాలు విశ్వాసంగా మెలుగుతాయి. అలాంటి ఓ నోరు లేని జీవమైన శునకం యజమానితో పాటు 600 కిలో మీటర్ల మేర అయ్యప్ప యాత్రలో పాల్గొంది. వివరాల్లోకి వెళితే.

శునకాన్ని విశ్వాసానికి మారు పేరుగా చెప్తారు. యజమాని పట్ల శునకాలు విశ్వాసంగా మెలుగుతాయి. అలాంటి ఓ నోరు లేని జీవమైన శునకం యజమానితో పాటు 600 కిలో మీటర్ల మేర అయ్యప్ప యాత్రలో పాల్గొంది. వివరాల్లోకి వెళితే.. నవీన్ అనే వ్యక్తి శబరిమల యాత్ర కోసం బయల్దేరాడు. అతనికి 38 సంవత్సరాలు. తన యాత్రలో అతని పెంపుడు శునకం కూడా తన వెంటే రావడం గమనించాడు. అలా నవీన్‌తో శునకం పంపానది వరకు వచ్చింది. 
 
కానీ అక్కడ మాలు అనే పేరున్న ఆ శునకం తన యజమాని నవీన్‌ను మిస్ అయింది. కుక్కకోసం వెదికిన నవీన్ గుడికి వెళ్లి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణానికి రెడీ అయ్యాడు. అయితే ఇంతలోనే శునకం ఖోజీకోడ్‌లో ఉందని ఫోన్ రావడంతో నవీన్ ఎంతో సంతోషానికి గురైయ్యాడు. పట్టలేనానందంతో మాలుకోసం ఆత్రంగా కొండ దిగి వచ్చాడు. అతను తిరిగివచ్చేంత వరకూ మెట్ల మీద తన కోసం ఎదురు చూస్తున్న మాలును గుండెలకు హత్తుకున్నాడు. ఈ సీన్ చూసిన స్థానికులంతా శునకాన్ని, దాని యజమానిని ప్రశంసలతో ముంచెత్తారు.