టిక్కెట్ చూపించమని అడిగినందుకు టీటీఈని చితక్కొట్టిన మహిళ, వీడియో
టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలు కదులుతున్న రైలులో బీభత్సం సృష్టించింది. ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన టిన్సుకియాలో జరిగింది. అస్సాంలోని టిన్సుకియా ద్వారా వెళుతున్న ఒక జనరల్ రైలు కోచ్‌లో దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఒక మహిళ, విధిలో ఉన్న టీటీఈపై భౌతికంగా దాడి చేసింది. అసలు విషయం ఏమిటంటే, టీటీఈ ఆమెను టికెట్ అడగ్గా, ఆమె చూపించలేకపోయింది.
దీంతో టీటీఇ జరిమానా కట్టమని చెప్పాడు. ఆమె జరిమానా చెల్లించడానికి బదులుగా, తీవ్ర వాగ్వాదానికి దిగి, అతనిపై భౌతిక దాడికి పాల్పడింది. పైగా టీటీఇ తనను అసభ్యంగా తాకాడంటూ ఫిర్యాదు చేసింది. ఐతే అదృష్టవశాత్తూ ఈ ఘటన వీడియో రికార్డింగ్‌తో ఉంది, లేకపోతే ఒక నిజాయితీపరుడైన టీటీఈ బాధితుడయ్యేవాడు.
Shocking victim card : Ticketless Woman Attacks TTE in Tinsukia
— Ramesh Tiwari (@rameshofficial0) June 9, 2026
A shocking incident occurred in a general train coach passing through Tinsukia, Assam, where a woman traveling without a ticket physically assaulted an on-duty TTE. Factually, when the TTE asked for her ticket,… pic.twitter.com/w5X2vX6C59
