1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Tragedy in Nashik-s Pandharipur: Vehicle plunges into unprotected well; 8 dead (Video)

నాసిక్ పండరీపురంలో విషాదం, రక్షణ గోడ లేని బావిలోకి దూసుకెళ్లిన వాహనం, 8 మంది మృతి, వీడియో

Baby body from well water
మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని పండరీపురంలో ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. అక్కడి దృశ్యాలు అత్యంత హృదయవిదారకంగా కనబడుతున్నాయి. బావి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు చిన్నారులను బైటకు తీస్తుండగా స్థానికులు కన్నీటి పర్యంతం అయ్యారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రక్షణ లేని బావిలో పికప్ వాహనం పడిపోవడంతో 8 మంది భక్తులు మృతి చెందారని వారు చెబుతున్నారు.
 
పండరిపురం సమీపంలో ఒకే గ్రామానికి చెందిన ఎనిమిది మంది యాత్రికులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వారి వాహనం అదుపుతప్పి, ఎలాంటి రక్షణ గోడ లేని లోతైన బావిలో పడిపోయింది. ఆలయంలో ప్రార్థనలు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. స్థానికులు ఆ ప్రమాదకరంగా మారిందనీ, గత 2 నెలల క్రితం ఇలాంటి ప్రమాదమే సంభవించగా ఇద్దరు మృత్యువాత పడినట్లు వారు చెబుతున్నారు.
About Writer
ఐవీఆర్