1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. TVK party expansion vijay focuses on Bengaluru Muncipal Elections

బెంగుళూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలపై సీఎం విజయ్ దృష్టి!

vijay
ఇటీవల తమిళనాడు రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీవీకే అధ్యక్షుడు విజయ్ ఇపుడు కర్నాటకపై ఫోకస్ చేశారు. ఇందులోభాగంగా, బెంగుళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా ఆ రాష్ట్రంలో కూడా టీవీకే జెండాను ఎగురవేయాలని భావిస్తున్నారు. 
 
దేశ ఐటీ నగర రాజధానిగా బెంగుళూరు నగరం వెలుగొందుతోంది. ఇక్కడ కన్నడ వాసులతో పాటు లక్షలాది మంది తమిళ ప్రజలు కూడా నివసిస్తున్నారు. పైగా, కర్నాటక వ్యాప్తంగా, ముఖ్యంగా బెంగుళూరు నగరంలో విజయ్‌కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆయనకు బలమైన మాస్ ఫాలోయింగ్ కూడా ఉంది. 
 
ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీవీకే పార్టీ ఇపుడు పొరుగు రాష్ట్రమైన కర్నాటకపై దృష్టిసారించడం సంచలనంగా మారింది. టీవీకే రాష్ట్రంలో పోటీ చేసిన తొలిసారే అధికారంలోకి రావడంతో బెంగుళూరు నగర వ్యాప్తంగా విజయ్ అభిమానులు భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. దీంతో బెంగుళూరులోని అభిమానులను ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు విజయ్ ప్లాన్ వేశారు. 
 
కర్నాటక రాజకీయాల్లో టీవీకే ఎంట్రీ ఇస్తుందనే వార్తలు బెంగుళూరు రాజకీయాల్లో ఇపుడే ప్రకంపనలు సృష్టిస్తున్నప్పటికీ దీనిపై విజయ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. పార్టీని ఇతర దక్షిణాది రాష్ట్రాలకు విస్తరించే వ్యూహంలో భాగంగానే ఈ ముందుడుగు ఉండబోతోందని, త్వరలోనే బెంగుళూరు ఎన్నికల పోటీపై టీవీకే స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
భారతదేశములో క్రెడిట్ కార్డుల వినియోగం పెరగడాన్ని ప్రోత్సహిస్తున్న ప్రధాన పోకడలు ఏంటి?