ప్రాణం పోయినా అతడే నా భర్త... శవాన్ని పెళ్లాడిన కేసులో సరికొత్త ట్విస్ట్
ప్రాణం పోయినా అతడే నా భర్త అని ప్రకటించి, చివరకు మృతదేహాన్ని పెళ్లాడిన ఓ యువతి కేసులో సరికొత్త విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. యువతి కుటుంబ సభ్యులతో మృతుడికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలిపే ఓ వీడియో ఒకటి ఇపుడు వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఇటీవల ఓ పరువు హత్య జరిగింది. తమ బిడ్డ తక్కువ కులానికి చెందిన యువకుడుని పెళ్ళి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేని యువతి తండ్రి, కుమారుడు కలిసి పరువు హత్యకు పాల్పడ్డారు. మృతుడు పేరు సక్షమ్ టాటే. అతని ప్రియురాల అచల్. ఈ కేసులో హంతకుల కుటుంబంతో మృతుడు సక్షమ్ టాటేకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ నెలలో నిందితులు గజానన్, సాహిల్, హిమేష్‌తో కలిసి సక్షమ్ డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న అచల్, ఆమె తండ్రి గజానన్ కొందరు యువకులతో కలిసి నృత్యం చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వారిలో సక్షమ్ కూడా ఉన్నారు.
మరోవైపు, తన కుటుంబ సభ్యుడు సక్షమ్‌తో సన్నిహితంగానే ఉండేవారని, పైగా, తమ వివాహానికి కూడా అంగీకరించారని తెలిపారు. అయితే, ఈ పెళ్ళి జరగాలంటే అతడు మతం మార్చుకోవాలని షరతు పెట్టడంతో అందుకు కూడా ఒప్పుకున్నాడని అంతలోనే ఈ దారుణం జరిగిందని వాపోయింది. సక్షమ్‌ను హత్య చేయడానికి ముందు తన సోదరులు తనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి సక్షమ్ టాటేపై కేసు పెట్టాలని ఒత్తిడి చేశారని, దానికి తాను అంగీకరించలేదని చెప్పారు. అదేసమయంలో సక్షమ్‌ను హత్య చేయడానికి పోలీసులు కూడా సహకరించారని ఆమె ఆరోపించారు.
ఇదిలావుంటే, తన ప్రియుడుని పరువు హత్య పేరుతో చంపేసినా అతడే తన భర్త అంటూ అచల్ పేర్కొంటూ శవాన్ని పెళ్ళాడిన విషయం తెల్సిందే. ఈకేసు ఆ యువతి ఇద్దరు సోదరులు, వారి స్నేహితులు సహా మొత్తం 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. తమ కుమార్తే వేరే కులానికి చెందిన యువకుడుని ప్రేమించి పెళ్ళి చేసుకుంటే తమ పరువు పోతుందని భావించి ఈ హత్య చేసినట్టు అచన్ తండ్రి గజానని వెల్లడించారు.