1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Uganda Traveller Isolated in Bengaluru Over Suspected Ebola Symptoms

ఉగాండా నుండి వచ్చిన మహిళకు ఎబోలా.. బెంగళూరులో ఐసోలేషన్

Ebola
Ebola
ఉగాండా నుండి వచ్చిన ఒక మహిళా ప్రయాణికురాలిలో ఎబోలా వైరస్ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపించడంతో, కర్ణాటక ఆరోగ్య అధికారులు ఆమెను బెంగళూరులో ప్రత్యేక నిర్బంధంలో ఉంచారు. దీంతో ముందుజాగ్రత్తగా నిఘా చర్యలను ముమ్మరం చేశారు.
 
నివేదికల ప్రకారం, ఆ మహిళ మే 23న బెంగళూరుకు చేరుకుని, నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో బస చేస్తున్నారు. స్వల్ప ఒళ్లు నొప్పులు, ఎబోలాకు సంబంధించిన ఇతర లక్షణాలను ఆమె తెలియజేయడంతో, తదుపరి పరిశీలన చికిత్స నిమిత్తం ఆమెను అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలోని అంటువ్యాధుల ఆసుపత్రికి తరలించారు. 
 
రోగి పరిస్థితి నిలకడగా ఉంది. ఆయన కట్టుదిట్టమైన వైద్య పర్యవేక్షణలో ఉన్నారు. మే 25న రక్తం, ఇతర వైద్య నమూనాలను సేకరించి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపడం జరిగింది. వీటి ఫలితాలు బుధవారం వెలువడే అవకాశం ఉంది. 
 
ఇప్పటివరకు భారతదేశంలో ఎటువంటి నిర్ధారిత ఎబోలా కేసు నమోదు కాలేదని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రజలు ఆందోళన చెందవద్దని, అలాగే తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని ఆ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
ఇన్‍‌స్టాలో పరియమైన మహిళ దూరం పెట్టిందనీ చంపేసిన ప్రియుడు.. ఎక్కడ?