సంబంధిత వార్తలు
- అమెరికా పోలీసు అధికారి నిర్లక్ష్యం: చనిపోయిన కర్నూలు యువతి కుటుంబానికి రూ. 262 కోట్ల పరిహారం
- బాలికపై తండ్రి - మేనమామ లైంగికదాడి.... గర్భందాల్చడంతో...
- బస్సు నడుపుతుండగానే ఆర్టీసీ డ్రైవరుకి గుండెపోటు, ఏం చేసాడంటే?
- మధుపానం మహాదానందం మనోధైర్యం ధనాధన్, పోటీపడి 19 బీర్లు తాగి మృతి
- సత్యనారాయణ వ్రతం చేయించుకుని ఇంటికి తిరిగి వస్తూ అనంతలోకాలకు చేరిన వధువు..
మేనల్లుడి మెహందీ వేడుకలో నృత్యం చేస్తూ గుండెపోటుతో మృతి చెందిన మేనమామ, వీడియో
ఇటీవలి కాలంలో అకస్మాత్తుగా గుండెపోటుతో వున్నచోటే కుప్పకూలి మృతి చెందుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. గుండెపోటు మరణాలు తరచూ జరుగుతుండటంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం రాత్రి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో కూడా గుండెపోటుతో ఓ వ్యక్తి కన్నుమూసారు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లా ఓజ్రా గ్రామంలో మంగళవారం రాత్రి మెహెందీ వేడుక ఘనంగా జరుగుతోంది. మేనల్లుడి మెహందీ కార్యక్రమంలో తన భార్యతో నృత్యం చేస్తున్న మేనమామ ఒక్కసారిగా ముందుకు తుళ్లి పడిపోయాడు. కాళ్లకు ఏదైనా అడ్డు తగిలి అలా పడిపోయారేమోనని తొలుత అనుకున్నారు. కానీ కదిలించి చూస్తే అతడు విగతజీవిలా మారాడు.
వెంటనే అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. దీనితో వివాహ వేడుక కాస్త దుఃఖంలో మునిగిపోయింది.
मध्य प्रदेश : भांजे की शादी में डांस कर रहे मामा की अचानक हुई मौत, नाचते-नाचते आया हार्ट अटैक#MadhyaPradesh | Madhya Pradesh | Heart Attack | #HeartAttack pic.twitter.com/ApeJoLB9sl
— News24 (@news24tvchannel) February 19, 2026
