శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 11 డిశెంబరు 2016 (17:32 IST)

బ్యాంకు నుంచి రూ.10నోట్లను దోచేశారు.. ఏకంగా కారునే కొనేశారు.. ఆపై...?

బ్యాంకు నుంచి రూ.10 నోట్లను దొంగలించారు. దొంగలించిన డబ్బుతో ఏకంగా కారునే కొనేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సహరాంపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళిత

బ్యాంకు నుంచి రూ.10 నోట్లను దొంగలించారు. దొంగలించిన డబ్బుతో ఏకంగా కారునే కొనేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సహరాంపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకరిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మలక్‌పూర్‌ హుస్సేన్‌ గ్రామానికి చెందిన నాసిర్, అఫ్జల్, రాకేష్, టినులు స్నేహితులు. ఈ నలుగురు యువకులు రాత్రికి రాత్రే ఓ కారునే కొనేశారు. దీంతో గ్రామస్తులంతా షాక్ అయ్యారు. 
 
అంతేగాకుండా పోలీసులకు సమాచారం అందించారు. ఇందులో పోలీసులు నాసిర్ అనే యువకుడిని అరెస్టు చేశారు. ఓ వైపు నగదు కొరతతో గ్రామస్తులు ఇబ్బంది పడుతుంటే వీరు జల్సా చేయడం, రాత్రికి రాత్రే కారు కొనడం వెనుక గల కారణాలను పోలీసులు ఆరా తీశారు. వీరికి వచ్చిన డబ్బంతా బ్యాంకు నుంచి దోచుకున్నది తెలుసుకున్న పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. 
 
ఇంకా గత నెల 19న మొత్తం పది లక్షల రూపాయలు దొంగతనానికి గురైందని తెలుసుకున్నారు. అందులో 5 లక్షలు రూ.10 నోట్లు, మిగిలిన 5 లక్షలు రూ.20 నోట్ల. దీనిపై కేసు దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులు అరెస్టు చేసిన నాసిర్ వద్ద నుంచి రూ.50వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు.