బుధవారం, 12 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 సెప్టెంబరు 2025 (21:48 IST)

భర్త సమోసా తీసుకురాలేదని భార్య గొడవ.. పోలీస్ స్టేషన్‌ వరకు వెళ్లింది..

Samosa
Samosa
సమోసా తీసుకురాలేదనే కారణంతో పెద్ద గొడవ దారితీసింది. భార్య తన పుట్టింటి వారితో కలిసి భర్త, మామపై దాడి చేయడంతో ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకు చేరింది. యూపీలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 30వ తేదీన, సంగీత తన భర్త శివమ్‌ను పని నుంచి తిరిగి వచ్చేటప్పుడు సమోసాలు తీసుకురమ్మని కోరింది. అయితే, శివమ్ సమోసాలు తీసుకురావడం మరిచిపోయి ఇంటికి వచ్చాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సంగీత భర్తతో గొడవకు దిగింది. ఆ రాత్రి భోజనం కూడా చేయకుండా వాగ్వాదానికి దిగింది. 
 
మాటామాటా పెరగడంతో, సంగీత తన తల్లిదండ్రులైన ఉష, రామ్‌లదాతేలను ఇంటికి పిలిపించింది. అనంతరం ముగ్గురూ కలిసి శివమ్‌తో పాటు అతని తండ్రి విజయ్ కుమార్‌పై దాడి చేసి దూషించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాడిలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని, ఘటనపై తదుపరి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.