మంగళవారం, 17 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

పెళ్లికి ముందు రౌడీషీటర్‌తో లేచిపోయిన లేడీ కానిస్టేబుల్

woman constable
ఓ మహిళా కానిస్టేబుల్ తన పెళ్లికి కొన్ని రోజుల ముందు ఓ రౌడీ షీటర్‌తో లేచిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలో జరిగింది. దీంతో ఈ వివాహం రద్దు అయింది.
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరరకు.. బాసుమా ప్రాంతానికి చెందిన సంధ్యా భరద్వాజ్ అనే మహిళ పోలీస్ కానిస్టేబుల్‌గా పని చేస్తోంది. ఆమెకు ముజఫర్ నగర్‌కు చెందిన మరో కానిస్టేబుల్ అతుల్ శర్మతో వివాహం నిశ్చయమైంది. ఇరు కటుంబాలు ఆహ్వాన పత్రికలు పంపించి, పెళ్లి ఏర్పాట్లో నిమగ్నమైవున్నారు. 
 
ఈ క్రమంలో శనివారం ఉన్నట్టుండి సంధ్య కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను అకింత్ చౌహాన్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసినట్టు పేర్కొన్నారు. చౌహాన్ ఒక రౌడీ షీటర్ అని, ఈ నెల 5వ తేదీన వరుడు అతుల్ శర్మకు ఫోన్ చేసి బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
దీంతో ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు... దర్యాప్తు చేపట్టగా సంధ్య బక్సర్ జిల్లాలో గుర్తించి విచారించగా, తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తాను స్వచ్ఛంధంగా అంకిత్ చౌహాన్‌తో వెళ్ళినట్టు సెలవిచ్చింది. అనేక కేసులు ఉన్న ఒక రౌడీషీటర్‌తో ఓ మహిళా కానిస్టేబుల్ లేచిపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.