బుధవారం, 10 డిశెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 సెప్టెంబరు 2025 (15:51 IST)

పానీపూరీలు నాలుగే ఇచ్చాడని రోడ్డుపై ధర్నాకు దిగిన మహిళ (video)

Panipuri
Panipuri
పానీపూరీ అంటే ఇష్టపడని భారతీయులు వుండరు. పానీపూరీలు అంటేనే చాలు సాయంత్రం ఆ షాపుల్లో లైన్లు కడుతుంటారు చాలామంది. తాజాగా పానీపూరి అమ్మేవాడు తనకు రెండు పానీపూరీలు తక్కువిచ్చాడని ఓ మహిళా ఏకంగా రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగడం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 
 
ఈ ఘటన గుజరాత్ వడోదరలో చోటుచేసుకుంది. తొలుత రూ.20లకు ఆరు పానీ పూరీలు ఇస్తానని.. నాలుగే ఇచ్చాడని మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు మిగతా రెండు పానీపూరీలు ఇచ్చే వరకు కదలనని పట్టుబట్టింది. 
 
వాహనదారులు జాగ్రత్తగా ఆమె పక్క నుంచి వాహనాలు పోనిచ్చారు. కొందరు రోడ్డు పక్కన గుంపుగా చేరి ధర్నాని చూస్తూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతోంది.