సోమవారం, 9 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 13 జనవరి 2026 (20:29 IST)

viral video, ఇదిగో ఈ పామే నన్ను కాటేసింది, చొక్కా జిప్ తీసి నాగుపామును బైటకు తీసాడు, ద్యావుడా

snake in the shirt
నాగుపామును చూస్తేనే వణికిపోతాం. అది పడగవిప్పి బుసలు కొడుతుంటూ ఇక ఎవ్వరికీ అటువైపు వెళ్లే ధైర్యం కూడా వుండదు. అట్లాంటిది ఏకంగా ఆ పామును తన చొక్కా లోపల పెట్టేసుకుని వచ్చేసాడు ఓ వ్యక్తి. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మధుర ప్రభుత్వ ఆసుపత్రికి ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి తనను పాము కాటు వేసిందనీ, తనకు చికిత్స చేయాలంటూ వైద్యులతో చెప్పాడు. అప్పుడా వైద్యులు... నిన్ను ఏ పాము కరిచిందో చెప్పు, తెలిస్తే వైద్యం మరింత సుళువు అవుతుందని అన్నారు. వాళ్లు ఆ మాట అనగానే... ఒక్క క్షణం అంటూ తన చొక్కా జిప్ తీసి పామును బైటకు తీసి.. ఇదిగో ఇదే నన్ను చేయి పైన కాటేసింది అంటూ నాగుపామును చూపించాడు. దాంతో అక్కడ వున్నవారంతా భయాందోళనకు గురయ్యారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.