1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Viral Video: UP Man Performs Dangerous Chin-Up On Railway Bridge Above Delhi-Lucknow Highway

ఇదేం పిచ్చిరా బాబూ.. హైవే వంతెనపై డేంజరస్ స్టంట్స్ (Video Viral)

dangerous stunts
ఓ వ్యక్తి జాతీయ రహదారిపై నిర్మించిన వంతెనకు వేలాడుతూ ప్రమాదకర స్టంట్స్ చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఢిల్లీ లక్నో జాతీయ రహదారిపై ఉన్న రైల్వే వంతెనపై నుంచి ఓ వ్యక్తి వేలాడుతూ కనిపించాడు. కింది నుంచి వాహనాలు వెళుతుండగా, వంతెన అంచును పట్టుకుని పుల్ అప్స్ చేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది 
 
ఈ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరు అనే వివరాలు తెలియలేదు. అయితే ఆ యువకుడి చర్యలను నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్‌లు చేసే వారివల్ల వారితో పాటు పక్కవారి ప్రాణాలకు కూడా ముప్పే అని హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్‌ చేస్తున్నారు. 

 
తర్వాతి కథనం
Indian Army: ఆపరేషన్ సింధూర్‌ ఎఫెక్ట్: 850 కామికాజ్ డ్రోన్‌లను కొనుగోలు చేసిన భారత సైన్యం