ఒక్కసారిగా కుప్పకూలిన వాటర్ హెడ్‌ట్యాంక్, కుక్క కూడా పరిశీలించింది, వీడియో
కాలం తీరిన వాటర్ హెడ్ ట్యాంక్ ఒకటి ఒక్కసారిగా కుప్పకూలింది. అదృష్టవశాత్తూ అది కూలిన ప్రాంతంలో, ఆ సమయంలో ఎవరు లేరు. వీడియో కనబడుతున్న దాని ప్రకారం కొన్ని అది కూలబోతున్న కొన్ని క్షణాలు ముందే స్కూల్ బస్సు ఒకటి వెళ్లింది. చిన్నారులంతా లక్కీ కిడ్స్.
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగినట్లు పలువురు నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇదిలావుంటే ట్యాంక్ శబ్దం చేస్తూ కూలిపోగా అక్కడున్నవారంతా భయంతో పరుగులు తీసారు. జంతువులు కూడా పరుగులు పెడతాయి. కానీ ఓ కుక్క మాత్రం అక్కడ ఏం జరిగిందో తెలుసుకునేందుకన్నట్లుగా అక్కడికి వచ్చి అంతా తేరిపార చూసి వెళ్లిపోయింది. ఈ కుక్కను ట్యాగ్ చేస్తూ మరికొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. చివరికి ఇట్లాంటి నాసిరకం నిర్మాణాలేంటని కుక్క కూడా పరిశీలించి వెళ్లింది అంటూ సెటైర్లు వేస్తున్నారు.
वीडियो कितना खतरनाक और डरावना है! अचानक पानी की टंकी गिर गई। अगर उस वक्त कोई नीचे होता, तो बड़ा और दर्दनाक हादसा हो सकता था। pic.twitter.com/xEh4gQ7eCI
— Anjali Kumari (@AnjaliKumari009) August 13, 2026
