1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. West Bengal : Former Domestic Help Kalita Majhi On Becoming Minister In Bengal : Modiji Brought Me Here

నాడు వంట మనిషి.. నేడు బెంగాల్‌ రాష్ట్ర మంత్రి...

kalitha majhi
ఒకపుడు నెలకు రూ.2,500 సంపాదనతో కుటుంబాన్ని పోషించుకున్న ఓ మహిళ ఇపుడు ఏకంగా వెస్ట్ బెంగాల్ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రు సువేందు అధికారి మంత్రివర్గంలో సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆమె పేరు కలిత మఝి. పూర్బ బర్ధమాన్ జిల్లాలోని ఆమ్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కలిత మారీ ఇపుడు ఏకంగా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ ఎమ్మెల్యే అయిన ఆమె, సోమవారం ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని మంత్రివర్గంలో సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. కోల్‌కతాలో జరిగిన ఈ కార్యక్రమం ఆమె జీవిత ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచింది. 
 
పూర్బ బర్ధమాన్ జిల్లాలోని ఆమ్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న కలిత మారీ నేపథ్యం అత్యంత సామాన్యమైనది. పేదరికం కారణంగా చదువును మధ్యలోనే ఆపేసిన ఆమె, కుటుంబాన్ని పోషించడానికి పలు ఇళ్లలో ఇంటి పనిమనిషిగా చేరారు. నెలకు రూ.2,500 నుంచి రూ.4,000 సంపాదిస్తూ కుటుంబాన్ని నెట్టుకొచ్చారు. ఆమె భర్త దినసరి కూలీగా పనిచేసేవారు. ఇలాంటి కఠిన పరిస్థితుల నడుమ కూడా ఆమె పదేళ్లుగా స్థానిక రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజలకు సేవ చేశారు. 
 
ఆమె రాజకీయ ప్రస్థానం పట్టుదలకు నిలువుటద్దంలా నిలుస్తుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్లపై ఇదే ఆస్ట్రమ్ (ఎస్సీ) స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ నిరాశ చెందకుండా ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. దీని ఫలితంగా 2026 ఎన్నికల్లో 1.07 లక్షలకు పైగా ఓట్లు సాధించి, తన సమీప తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిపై 12,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే మంత్రి పదవి వరించడం విశేషం.
 
మంత్రిగా అవకాశం రావడంపై కలిత మారీ భావోద్వేగానికి గురయ్యారు. "నాలాంటి వాళ్లు ఈ స్థాయికి చేరుకుంటారని కలలో కూడా ఊహించలేరు. ముఖ్యమంత్రి సువేందు అధికారి తన మంత్రివర్గంలో నాకు చోటు కల్పిస్తారని అస్సలు అనుకోలేదు" అని ఆమె విలేకరులతో అన్నారు. తన నియోజకవర్గంలో తాగునీటి సరఫరా, ఆసుపత్రి సౌకర్యాలు మెరుగుపరచడమే తన ప్రథమ కర్తవ్యమని, ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
 
ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాల నేపథ్యంలో జరిగిన ఈ మంత్రివర్గ విస్తరణలో కలిత మారీఖ చేరిక ప్రాధాన్యం సంతరించుకుంది. అట్టడుగు స్థాయి కార్యకర్తలకు సైతం ఉన్నత అవకాశాలు కల్పించడంలో తమ పార్టీ ముందుంటుందనడానికి ఆమె నియామకమే నిదర్శనమని బీజేపీ నేతలు అభివర్ణించారు. ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణం ప్రజాస్వామ్యంలో అవకాశాలకు, పట్టుదలకు ప్రతీకగా నిలుస్తోంది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
మరో మూడేళ్ల తర్వాత ఒక్క ఉద్యోగి ఉండరు... : గూగుల్ మాజీ బిజినెస్ చీఫ్