డీజీపీ ఆఫీసులోనే రాసలీలలు - ఈ పాడుపనికి పాల్పడింది నటి తాన్యారావు తండ్రేనా?
కర్నాటక రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో అశ్లీల కార్యకలాపాలకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలు వైరల్ కావడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దృష్టికి వెళ్లాయి. దీంతో ఆయన ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.
కర్నాటక రాష్ట్రంలో సంచలనం రేపిన బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టు అయిన కర్నాటక నటి తాన్యారావు తండ్రి రామచంద్రరావు ఆ రాష్ట్ర పోలీస్ శాఖలో ఉన్నతాధికారిగా ఉన్నారు. ఈయన రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ, అశ్లీల కార్యకలాపాలకు పాల్పడ్డారు. వీటిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారణకు ఆదేశించారు.
మరోవైపు డీజీపీ కార్యాలయంలో తాను పలువురు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించగా తీసిన వీడియో వైరల్ కావడంతో రామచంద్రరావు మీడియా ముందుకు వచ్చారు. ఈ వీడియోలను కృత్రిమ మేథ (ఏఐ)తో సృష్టించారని ఆయన ఆరోపించారు.