సంబంధిత వార్తలు
- Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది
- బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోషన్: 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు
- ప్రభుత్వ ఉద్యోగిగా రూ. 3 కోట్లు ఆర్జిస్తే, కుట్టుపని చేసి అతడి భార్య రూ. 8 కోట్లు సంపాదించిదట?!!
- టీఎంసీలో పెను ప్రకంపనలు - 20 మంది ఎంపీల షాక్ - ఫిరాయింపుల చట్టం ఏం చెబుతోంది.?
- Karnataka: చెట్టు పైనుంచి పడిన కొబ్బరికాయ.. బాలుడి తలపై పడటంతో మృతి
పురుష శవాల ప్రైవేట్ భాగాలపై జోకులు వేసిన లేడీ డాక్టర్... తర్వాత...
ఓ మహిళా వైద్యురాలు వివాదంలో చిక్కుకున్నారు. ఓ కామెడీ షోలో పాల్గొన్న ఆమె పురుష శవాల ప్రైవేట్ భాగాలపై జోకులు వేశారు. ఇది వైద్య నైతికతను ఉల్లంఘించారంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ తరహా కామెంట్స్ వైద్య నైతికతను ఉల్లఘించారంటూ విమర్శలు వచ్చాయి. ఇది పెద్ద వివాదం కావడంతో సారీ చెబుతూ వీడియో విడుదల చేశారు.
వైద్య శిక్షణ కోసం ఉపయోగించే మృతదేహాలపై (కడావర్స్) ఆమె అనుచిత వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు, వైద్య వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో చివరకు ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
ముంబైలోని ప్రసిద్ధ కేఈఎం ఆస్పత్రి నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ సెజల్ పవార్ ఇటీవల స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోర్ నిర్వహించిన షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమెడియన్ అడిగిన ఓ ప్రశ్నకు ఆమె బదులిస్తూ, అనాటమీ క్లాసుల్లో పురుషుల మృతదేహాలను చూసినపుడు తమ స్నేహితురాళ్లతో కలిసి వాటి ప్రైవేట్ భాగాల గురించి సరదాగా మాట్లాడుకునేవాళ్లమని, వాటి పరిణామాలు పోల్చి చూసేవాళ్లమని నవ్వుతూ చెప్పారు.
ఈ క్లిప్ సోషల్ మీడియాలో వ్యాపించడంతో డాక్టర్ సెజల్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. వైద్యం కోసం తమ శరీరాలను దానం చేసిన వారి పట్ల కనీస గౌరవం లేకుండా మాట్లాడటం వైద్య నైతికతకు విరుద్దమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థులు మృతదేహాన్ని తాకే ముందు చేసే కడావరిక్ ఓత్ (శవపరీక్ష ప్రమాణం)ను ఆె అవమానించారని మండిపడ్డారు.
వివాదం ముదరడంతో డాక్టర్ సెజల్ పవార్ ఇన్‌స్టా ద్వారా క్షమాపణలు తెలిపారు. ఆ షోలో నేను చాలా అమాయకంగా, ఆలోచించకుండా మాట్లాడాను. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టివుంటే క్షమించండి. నేను చేసిన తప్పుకు పూర్తి బాధ్యత వహిస్తున్నాను. భవిష్యత్‌లో ఇలాంటి పొరపాటు పునరావృత్తం కాదు అని ఆమె పేర్కొన్నారు.
