1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Why Irani cafes are at corner of streets, and centre of hearts

ఇరానీ కేఫ్‌లన్నీ స్ట్రీట్ కార్నర్స్‌లోనే ఎందుకు ఉంటాయి?

irani cafe
ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో ఇరానీ కేఫ్‌లు కేవలం స్ట్రీట్ కార్నర్స్ వీధుల కూడళ్ళలోనే కనిపిస్తుంటాయి. ఇలా ఎందుకు ఉంటాయో అర్థం కాదు. ముఖ్యంగా, దక్షిణ ముంబై వీధుల్లో నడుస్తుంటే ఇరానీ చాయ్. తాజా మావా కేక్స్, బ్రన్-మస్కాల సువాసనలు మనల్ని పలకరిస్తాయి. 
 
అయితే, ఈ కేఫ్ లన్నింటినీ గమనిస్తే ఒక విచిత్రమైన పోలిక కనిపిస్తుంది. ముంబైలోని పాతకాలపు ఇరానీ కేఫ్‌లు దాదాపు అన్నీ వీధుల కూడళ్లలో లేదా మూల మలుపుల్లో మాత్రమే ఉంటాయి. దీని వెనుక కేవలం వ్యాపార వ్యూహం మాత్రమే కాదు, ఒకప్పటి భారతీయ 'వాస్తు శాస్త్ర' నమ్మకాలతో ముడిపడిన ఆసక్తికరమైన చరిత్ర ఉందట. 
 
19వ శతాబ్దం చివరిలో ఇరాన్ దేశంలో తీవ్ర కరువు, మతపరమైన అణచివేత కారణంగా వేలాది మంది ఇరానీలు బొంబాయి (ప్రస్తుత ముంబై) నగరానికి వలస వచ్చారు. చాలా పరిమితమైన ఆర్థిక వనరులతో వచ్చిన వీరు, ఇక్కడ బ్రతకడం కోసం చిన్న చిన్న చాయ్ హోటళ్లు పెట్టాలని నిర్ణయించుకున్నారు. 
 
కానీ, ఆ సమయంలో నగరంలో వాణిజ్య స్థలాల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో వారికి సాధారణ ప్లాట్లు కొనడం సాధ్యపడలేదు. సరిగ్గా అదే సమయంలో స్థానిక వ్యాపారులలో ఉన్న వాస్తు నమ్మకాలు ఈ ఇరానీ వలసదారులకు వరంగా మారాయి. 
 
వాస్తు శాస్త్రం ప్రకారం వీధుల చివరన ఉండే త్రిభుజాకార ప్లాట్లు లేదా "సింహ ముఖ" (ముందు వెడల్పుగా, వెనుక ఇరుగ్గా ఉండే) ప్లాట్లు వ్యాపారాలకు కలిసి రావని, అవి అరిష్టమని నాటి హిందూ వ్యాపారులు నమ్మేవారు. దీంతో ఆ మూల స్థలాలను కొనేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో యజమానులు వాటిని చాలా తక్కువ ధరలకే విక్రయించేవారు. మన దేశ ఆచారాలు, వాస్తు నమ్మకాలపై పెద్దగా అవగాహన లేని ఇరానీలు.. ఆ చౌక స్థలాలను అందిపుచ్చుకుని కేఫ్ లను నిర్మించారు.
 
అయితే వాస్తు ప్రకారం అరిష్టమనుకున్న ఆ మూల ప్లాట్లే కాలక్రమేణా ఇరానీ కేఫ్ విజయానికి ప్రధాన కారణమయ్యాయి. నాలుగు వీధులు కలిసే జంక్షన్లలో ఇవి ఉండటం వల్ల అన్ని వైపుల నుంచి వచ్చే మిల్లు కార్మికులు, టాక్సీ డ్రైవర్లు, రేవు కూలీలు, విద్యార్థులకు ఇవి సులువుగా కనిపించేవి. వ్యాపారానికి అద్భుతమైన విజిబిలిటీ లభించడంతో క్యానీ అండ్ కో, సస్సానియన్, బ్రిటానియా, కేఫ్ మిలిటరీ వంటి కేఫ్‌లు ముంబై నగర చరిత్రలో చెరగని ముద్ర వేశాయి. నాడు మూలల్లో విసిరేసినట్లు ఉన్న ఆ స్థలాలు.. నేడు ముంబై నైరుతి సంస్కృతికి, నోస్టాల్జియాకు కేంద్ర బిందువులుగా మారడం ఒక మధురమైన వైరుధ్యం. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
డబ్బులు ఇచ్చి చావును కొనుక్కోవడం అంటే ఇదేనేమో..! (Video)