పెళ్లై 15 ఏళ్లయినా భార్య మరొకరితో వివాహేతర సంబంధం, కన్నీటి పర్యంతమైన భర్త
పెళ్లయి 15 ఏళ్లయినా తన భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని వుండటాన్ని భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. తన భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో ఆమె నడిపే స్కూటీకి జిపిఎస్ ట్రాకర్ అమర్చాడు. దాని ద్వారా తన భార్య కదలికలను పసిగట్టి ఆమెను మరో వ్యక్తితో కలిసి వుండగా చూసి కన్నీటిపర్యంతమయ్యాడు. అమృత్‌సర్‌లో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా వున్నాయి.
అమృత్‌సర్‌కు చెందిన భార్యాభర్తలకు పెళ్లై 15 సంవత్సరాలు అయింది. రవి గులాటి, హిమానిని ఏప్రిల్ 25, 2010న వివాహం చేసుకున్నాడు. ఐతే కొన్నాళ్లపాటు వారి దాంపత్యం సజావుగా సాగినా పెళ్లైన 7 సంవత్సరాలకు తన భార్య మరొకరితో సన్నిహితంగా వుండటాన్ని గమనించాడు. తన భార్య మరో వ్యక్తితో కలిసి ఒక హోటల్‌లో ఉండగా అతను చాసాడు. ఆ సమయంలో రవి తన అత్తమామలకు విషయం చెప్పాడు. వారు వచ్చి తమ కుమార్తెతో మాట్లాడి క్షమాపణలు చెప్పించారు. ఇద్దరు పిల్లలు కూడా పుట్టడంతో భార్య తన తీరు మార్చుకుంటుందని రవి అనుకున్నాడు.
ఐతే ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. గత సంవత్సర కాలంగా తరచూ ఆమె మరో వ్యక్తితో కలిసి ఏకాంతంగా గడుపుతూ వస్తోంది. తన భార్య ప్రవర్తనపై అనుమానాలు పెరగడంతో ఆమె కదలికలను గమనించడానికి ఆమె స్కూటర్‌కు జీపీఎస్ ట్రాకర్‌ను అమర్చాడు. అతని భార్య మధ్యాహ్నం 3:00 నుండి 3:30 గంటల మధ్య ఇంటి నుండి బయటకు వెళ్ళింది. షాపులో పనిచేస్తున్న రవి ఆమెకి 20 సార్లు ఫోన్ చేసినా భార్య స్పందించలేదు. ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో జీపీఎస్ లొకేషన్‌ను తనిఖీ చేసి, తన దుకాణాన్ని మూసివేసి, ఆ సిగ్నల్‌ను అనుసరించాడు. ఆ లొకేషన్ అతడిని ఒక హోటల్‌కు తీసుకెళ్లింది. అక్కడ తన భార్య మరో వ్యక్తితో కలిసి ఉండగా చూశాడు. దాంతో కన్నీటిపర్యంతమయ్యాడు.
కాగా పట్టుబడిన భార్య మాత్రం భర్త రవితో తెగదెంపులు చేసుకుని పుట్టింటికి వెళ్లిపోతానంటూ చెప్పేసింది. దీనిపై ఏం చేయాలో అర్థంకాక రవి కన్నీళ్లతో ఆవేదన చెందుతున్నాడు.