1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Woman Alleges Naked Men Chased Her Auto While Travelling In Noida

ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలు.. కారులో నగ్నంలో అట్టహాసం

ncr woman
దేశ రాజధాని ప్రాంతం పరిధిలోని నోయిడాలో పట్టపగలే మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేసే అత్యంత భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు మహిళలు ప్రయాణిస్తున్న ఆటోను, ముగ్గురు వ్యక్తులు ఉన్న ఒక కారు వెంబడించింది. ఆ కారులో ఇద్దరు వ్యక్తులు నగ్నంగా ఉన్నారని బాధితురాలు ఆరోపించింది. ఈ భయానక అనుభవాన్ని దీపిక అనే యువతి ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా పంచుకోగా, అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
గత శుక్రవారం ఆఫీస్ వేళల్లో తాను, మరో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగిందని దీపిక తన వీడియోలో వివరించింది. "మీరు వెళ్తున్న ఆటోను ఒక కారు వెంబడిస్తూ, అందులో ఇద్దర నగ్నంగా ఉంటే మీరేం చేస్తారు? మాకు సరిగ్గా అదే జరిగింది" అంటూ తీవ్ర ఆవేదనతో ఆమె తన అనుభవాన్ని తమ ఆటోను పదేపదే ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నిస్తూ, ప్రమాదకరంగా దగ్గరికి వస్తూ ఆ కారు వేధించిందని ఆమె తెలిపింది. 
 
ఒకానొక దశలో కారును పక్కకు తిప్పి చూస్తే, ప్యాసింజర్ సీటులో ఒక వ్యక్తి కాళ్లు డ్యాష్ బోర్డపై పెట్టి పూర్తిగా నగ్నంగా పడుకుని ఉన్నాడని, కారులోని వారు నవ్వుతున్నారని ఆమె వివరించింది. ఈ ఘటనతో తాము ముగ్గురం తీవ్ర భయాందోళనకు గురయ్యామని, వెంటనే ఆటో డ్రైవరున్ను వేగంగా పోనివ్వమని అరిచామని చెప్పింది.
 
భయంతో బిగుసుకుపోవడం వల్ల ఆ సమయంలో కారు నంబర్ చూడలేకపోయామని, పోలీసులకు కూడా వెంటనే ఫిర్యాదు చేయలేకపోయామని దీపిక పేర్కొంది. "ఆ సంఘటన గురించి ఆలోచించిన ప్రతీసారి నేను భయంతో గడ్డకట్టుకుపోతున్నాను" అని ఆమె చెప్పింది. ఈ ఘటన తర్వాత ప్రయాణాలంటేనే వంద రెట్లు ఎక్కువ భయంగా, జాగ్రత్తగా ఉంటున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నోయిడాలో ప్రయాణించే మహిళలు, ముఖ్యంగా నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
 
ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, లేకపోతే ఇలాంటి దుండగులు మరిన్ని నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందని పలువురు సూచిస్తున్నారు. నోయిడాలో మహిళల భద్రతపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
టీవీకే ప్రభుత్వ శుభవార్త... వచ్చే బిల్లింగ్ సైకిల్ నుంచే ఉచిత విద్యుత్ పథకం అమలు