సంబంధిత వార్తలు
- చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త ఆధార్ నిబంధనలు.. ఎక్కడ?
- తాతపై బైకుపై వెళుతున్న బాలిక ... కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కామాంధుడు
- తోక తెగి కిందపడ్డ హెలికాప్టర్, నేలపై గిరికీలు కొడుతూ పైలెట్లను బొమ్మల్లా ఆడించింది, వీడియో
- ప్రేమించి పెళ్లి చేసుకుందని కన్నతండ్రే కుమార్తెను కడతేర్చాడు.. అందరూ చూస్తుండగా..?
- కాకినాడ : జ్యూస్లో నిద్రమాత్రలిచ్చి భర్తను చంపేసిన భార్య
వారణాసి జిల్లా కోర్టులో జడ్జి కుర్చీ ఖాళీగా ఉందనీ... (వీడియో)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి జిల్లా కోర్టులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం జిల్లా జడ్జి సెలవులో వెళ్లారు. అయితే, ఉదయాన్నే కోర్టు హాలులోకి వచ్చిన వందనా గుప్తా (50) అనే మహిళ నేరుగా వెళ్లి జడ్జి కుర్చీలో కూర్చుని గావెల్‌తో (చెక్క సుత్తి) కొడుతూ 'ఆర్డర్ ఆర్డర్.. విచారణలు ప్రారంభించండి?' అని సూచనలు జారీ చేశారు.
ఊహించని ఈ ఘటనతో అవాక్కయిన న్యాయవాదులు కిందికి దిగాలని ఆమెను ఎంతగా కోరినా ససేమిరా అన్నారు. దగ్గరకు ఎవరూ రావద్దని హెచ్చరించారు. దీంతో కోర్టు హాలులో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.
ఆ తర్వాత మహిళా పోలీసుల సాయంతో ఆమెను కిందికి దింపి కంటోన్మెంట్ ఠాణాకు తరలించారు. పోలీసుల విచారణలో వందన మానసిక పరిస్థితి బాగాలేదని గుర్తించి, నగర శివారులోని శివ్‌పుర్ ప్రాంతానికి చెందిన ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
జడ్జి సీటు ఖాళీగా ఉందని..
— ChotaNews App (@ChotaNewsApp) June 14, 2026
ఉత్తరప్రదేశ్లోని వారణాసి జిల్లా కోర్టులో శుక్రవారం జిల్లా జడ్జి సెలవులో ఉండటంతో ఒక అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఉదయాన్నే కోర్టు హాలులోకి వచ్చిన వందనా గుప్తా (50) అనే మహిళ నేరుగా వెళ్లి జడ్జి కుర్చీలో కూర్చున్నారు. అక్కడ ఉన్న గావెల్ను(చెక్క సుత్తి) కొడుతూ… pic.twitter.com/pEQLBgt46L
