చీర కొనివ్వలేదని ప్రెషర్ కుక్కర్‌తో భర్త తలపై కొట్టిన భార్య... ఏమైందంటే?
మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో అలాంటి అమానుష ఘటన వెలుగుచూసింది. కేవలం చీర కొనివ్వలేదన్న క్షణికావేశంలో భార్యాభర్తల మధ్య మొదలైన గొడవ, చివరకు ఒకరి ప్రాణాన్నే తీసింది. బద్లాపూర్ ఈస్ట్ పరిధిలోని శిర్గావ్‌లో.. హరేరామ్ సింగ్ అనే వ్యక్తి తన భార్య సునీతా దేవితో కలిసి శిర్గావ్‌లో నివసిస్తున్నాడు.
మంగళవారం సాయంత్రం తనకు ఒక చీర కొనివ్వాలని సునీతా దేవి భర్తను కోరింది. దానికి హరేరామ్ సింగ్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య చిన్నగా గొడవ ప్రారంభమైంది. మాటామాటా పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సునీతా దేవి, కిచెన్‌లో ఉన్న ప్రెషర్ కుక్కర్‌ను తీసుకొచ్చి భర్త తలపై బలంగా కొట్టింది. ఆ దాడికి హరేరామ్ సింగ్ కిందపడిపోగా, అనంతరం ఆమె అతని గొంతు నులిమి దారుణంగా హత్య చేసినట్లు ఆధారాలు లభించాయి.
బాధితుడైన హరేరామ్ సింగ్ అంగవైకల్యం కారణంగా మంచానికే పరిమితమైన వ్యక్తి కావడం వల్ల, భార్య చేసిన దాడి నుంచి తనను తాను కాపాడుకోలేకపోయాడు. తల్లి చేసిన దారుణాన్ని బాలుడు పూసగుచ్చినట్లు వివరించాడు. చిన్నారి ఇచ్చిన ప్రత్యక్ష సాక్ష్యంతో అసలు నిజం బయటపడటంతో, సునీతా దేవిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
