సంబంధిత వార్తలు
- ఇన్స్టాగ్రామ్ ప్రేమ.. ఐదు లక్షలు కట్నంగా తెమ్మన్నాడు.. ఎలుకల మందు తాగి?
- క్యాస్టింగ్ కౌచ్.. ఛాన్స్ కోసం వెతికితే ఒక రిసార్ట్‌కు రమ్మన్నారు..తెలుగు ఇన్ఫ్లుయెన్సర్
- తల్లి బంగారన్ని తెగనమ్మి ఇన్స్టాగ్రామ్ ప్రియుడికి బైక్ కొనిచ్చిన ప్రియురాలు
- లెక్కలేనన్ని కేసులున్నవారినే ఏం చేయలేకపోతున్నారు, నా ఈక కూడా పీకలేరు: యూట్యూబర్ అన్వేష్ సవాల్
- ఇన్‌స్టాలో సరికొత్త రికార్డు నెలకొల్పిన ప్రధాని మోడీ... ఏంటది?
స్పోర్ట్స్ బైక్ పైన యువతీయువకులు రీల్స్... డివైడర్‌ను ఢీకొట్టి యువతి మృతి, వీడియో
తల్లిదండ్రులు ఎంతో ప్రాణప్రదంగా పెంచిపెద్ద చేస్తారు తమ పిల్లల్ని. ఐతే యుక్తవయస్సుకి వచ్చాక తల్లిదండ్రుల మాటలను పెడచెవిన పెట్టడమే కాకుండా వారికి వ్యధను కల్గించే పనులు చేస్తుంటారు కొంతమంది పిల్లలు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో యువతీయువకులు రీల్స్ పిచ్చిలో ఎక్కువ కొట్టుకుపోతున్నారు.
అలా ఉత్తరప్రదేశ్ ఘజియాబాదులో ఇద్దరు యువతీయువకులు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై చేసిన ఫీట్స్ వారి ప్రాణాల మీదికి తెచ్చింది. ఇక్రా అనే యువతి స్నేహితుడు హసీం తన స్పోర్ట్స్ బైకుని ఆమెతో నడిపించాడు. యువతి నడుపుతుండగా అతడు రీల్స్ కోసం వీడియో తీస్తున్నాడు. అతివేగంగా వెళ్తూ వీడియో కోసం యువతి కెమేరా వైపుకి చూసింది. దీనితో వాహనంపై నియంత్రణను కోల్పోయి డివైడర్‌ను ఢీకొట్టింది.
ఈ ఘటనలో యువతీయువకులు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువతి ప్రాణాలు కోల్పోయింది. యువకుడి పరిస్థితి విషమంగా వున్నట్లు వైద్యులు తెలిపారు.
బైక్ పై రీల్స్ చేస్తూ యువతి మృతి
— BIG TV Breaking News (@bigtvtelugu) April 14, 2026
ఉత్తర్‌ప్రదేశ్ గాజియాబాద్‌లో విషాదం
రీల్స్ చేసేందుకు తన ఫ్రెండ్ తో కలిసి నేషనల్ హైవే పైకి వెళ్లిన ఇక్రా అనే యువతి
యువతి స్పీడ్ గా స్పోర్ట్స్ బైక్ నడిపిస్తుండగా.. హసీం వెనుక కూర్చొని వీడియో చిత్రీకరణ
వీడియో కోసం వెనక్కి తిరిగిన ఇక్రా..… pic.twitter.com/LDzwwP7tdc
