శనివారం, 14 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 3 ఫిబ్రవరి 2026 (15:32 IST)

YouTuber అరుణ్‌ పన్వర్‌కి కట్నంగా రూ. 71 లక్షలు, 21 తులాల బంగారం?

YouTuber Arun panwar
ఫోటో కర్టెసి- సోషల్ మీడియా
ఈరోజుల్లో అబ్బాయిలకు పెళ్లిళ్లు చేసేందుకు ఎంత శ్రమించాల్సి వస్తుందో వారి తల్లిదండ్రులను అడిగితే తెలుస్తుంది. అమ్మాయిలకు ఊరకనే పెళ్లయ్యిపోతోంది. కానీ ప్రముఖ యూట్యూబర్ అరుణ్ పన్వార్‌కి అత్తవారింట నుంచి రూ. 71 లక్షల నగదు, 21 తులాల బంగారాన్ని సమర్పించారు వధువు తల్లిదండ్రులు. ఐతే కట్నం అంటే అది నేరమవుతుంది కనుక బహుమతులుగా ఈ నగదు, బంగారం ఇస్తున్నట్లు వారు చెప్పుకుంటున్నారు. 
 
71 లక్షల డబ్బును అంతా గంపల్లో వరుడు ముందు పేర్చారు. ఈ సీన్ చూసిన పెళ్లికాని అబ్బాయిలు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంజినీర్, డాక్టర్ వంటి వారికే రూ. 50 లక్షలు కట్నంగా ఇచ్చేందుకు ఎవ్వరూ రావడం లేదు కానీ ఓ యూట్యూబర్‌కి ఇంత కట్నమా అని నోరెళ్లబెడుతున్నారు. 
 
ఐతే సదరు యూ ట్యూబర్ ఆదాయం నెలకి రూ. 25,00,000 వస్తోందట. కాలు మీద కాలేసుకుని హ్యాపీగా వీడియోలు చేసుకుంటూ ఈ ఆదాయాన్ని అతడు పొందుతున్నాడు కనుక అత్తారంటివారు అతడికి అంతమొత్తంలో బహుమతులు ఇచ్చారంటూ చెప్పుకుంటున్నారు. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అది కాస్తా వివాదస్పదం అవుతోందని భావించి దాన్ని తొలగించేసారు. కానీ ఫోటోలు మాత్రం తిరుగుతూనే వున్నాయి.