శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 8 అక్టోబరు 2019 (17:55 IST)

మైసూర్ రాజా వారి జంబూ సవారీ...

దేశంలో జరిగే దసరా ఉత్సవాలు ఒకెత్తైతే ... అక్కడ జరిగే వేడుకలు మాత్రం సంథింగ్ స్పెషల్... అదే మైసూర్ రాజా వారి ప్యాలేస్. అందరి అడుగులూ అటువైపే అన్నట్లుగా మైసూర్ ప్యాలేస్ వైపే. జంబూ సవారీని వీక్షించేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు వేలాదిగా తరలి రావడంతో బెంగళూర్ దసరా శోభతో కళకళలాడుతోంది.
 
జంబూ సవారి చూసేందుకు లక్షలాదిగా ప్రజలు మైసూర్ ప్యాలేస్ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఉత్సవాల సమారంభ ప్రారంభ క్షణాల కోసం పరితపిస్తున్నారు. నవరాత్రుల ఉత్సవాల సందర్బంగా స్వర్ణ వర్ణంలో ప్యాలేస్ ధగధగలాడుతూ బంగారం కాంతులను విరజిమ్ముతోంది. వేల సంఖ్యలో సందర్శకులు ఇప్పటికే నగరాన్ని చేరుకున్నారు.
 
ఉత్సవాల సందర్బంగా నిర్వహించే జంబూ సవారీని కనీసం నాలుగున్నర లక్షల మంది వీక్షిస్తారని అంచనా. మరికొన్ని గంటల్లో ఆ శుభముహూర్తం ఆసన్నం కానుంది. తనివితీరా వీక్షించేందుకు ఉత్సాహాన్ని పర్యాటకులు చూపుతున్నారు. రాచనగరి వీధులు రాత్రి నుంచే సందడిగా మారాయి. నగరం నుంచి బన్నిమంటపను చేరుకునే మార్గంలో తగిన స్థలాన్ని ఎంపిక చేసుకునేందుకు ఎప్పుడెప్పుడు తెల్లారుతుందోనని ఎదురుచూస్తున్నారు.
 
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా జంబూ సవారీ మార్గంలోని ప్రత్యేక భద్రతను అధికారులు సిద్ధం చేశారు. రాత్రి సమయంలో మైసూర్ ప్యాలెస్ అందాలు చూసేందుకు మాత్రం పర్యాటకులు మధురానుభూతిగా మారింది. మైసూర్ ప్యాలెస్‌కు ఉండే ఘన చరిత్ర అందరికీ తెలిసిందే. కానీ దసరా ఉత్సవాల్లో మాత్రం మైసూర్ ప్యాలేస్‌లో జరిగే బంబూ సవారికి ప్రత్యేక సాంప్రదాయంగా కొనసాగుతోంది. అంతకుమించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.