1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
  4. Navaratri 2026: Kathyayani Puja significance

శరన్నవరాత్రులు.. ఆరవ రోజు కాత్యాయనీ పూజ.. మంత్ర పఠనం ఎలా?

Kathyani Devi
Kathyani Devi
శరన్నవరాత్రుల్లో ఆరో రోజు దుర్గాదేవి ఆరవ రూపమైన శ్రీ కాత్యాయనీ దేవిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. దుష్టసంహారం చేస్తూ ధర్మాన్ని నిలబెట్టే శక్తిస్వరూపిణిగా అమ్మవారు పూజలందుకుంటారు. భక్తుల జీవితంలోని అడ్డంకులు, కష్టాలు తొలగిపోయి శాంతి, సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని పూజిస్తారు. ఈ తల్లిని ఆరాధించడం వల్ల జీవితంలో ధర్మ, అర్థ, కామ, మోక్షాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
 
మహర్షి కాత్యాయనుడు జగన్మాతను తన దివ్య పుత్రికగా పొందేందుకు ఎంతో కఠినమైన తపస్సు ఆచరించాడు. ఆయన నిష్టకు ప్రసన్నులైన దుర్గాదేవి ఆయన కోరికను మన్నించి కుమార్తెగా జన్మించింది. మహర్షి కాత్యాయనుడి పేరు మీదుగానే అమ్మవారికి కాత్యాయనీ అనే పేరు స్థిరపడింది. మహిషాసురుడిని అంతమొందించిన శక్తిమంతమైన రూపాలలో ఈమె ఒకరుగా ప్రసిద్ధి చెందారు.
 
అలాంటి మహిమాన్వితమైన కాత్యాయని దేవీకి ప్రత్యేకంగా తేనె లేదా తేనెతో చేసిన మిఠాయిలను నైవేద్యంగా పెట్టడం ఆచారం. పూజా సమయంలో అమ్మవారి బీజ మంత్రాన్ని పఠిస్తూ, దుర్గా చాలీసా లేదా సప్తశతి పఠించాలి. చివరగా కర్పూర హారతి ఇచ్చి కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాల కోసం ప్రార్థించాలి.
 
ఈ ఏడాది అక్టోబర్ 16, శుక్రవారం నాడు నవరాత్రుల ఆరవ రోజు పూజ నిర్వహించుకోవడానికి అనుకూలమైన శుభ సమయాలు 
అభిజిత్ ముహూర్తం: ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:35 వరకు
సంధ్యా సమయం: సాయంత్రం 5:51 నుండి 6:16 వరకు
 
ఈ పూజా రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేయడం శ్రేయస్కరం. అమ్మవారి పూజకు మందారం, గులాబీ వంటి ఎర్టిని పూలను వినియోగించడం వల్ల విశేష ఫలితం ఉంటుంది. 
 
కాత్యాయనీ దేవి బీజ మంత్రం:
ఓం దేవి కాత్యాయణ్యై నమః॥
 
ఈ పవిత్ర మంత్రాన్ని ప్రశాంత మనసుతో జపించడం ద్వారా మనలో ఆత్మవిశ్వాసం, ధైర్యం రెట్టింపు అవుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
16-10-2026 శుక్రవారం నాటి రాశి ఫలాలు - ఓర్పుతో వ్యవహరిస్తే సమస్యలు...?