శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. దసరా
Written By Selvi
Last Updated : సోమవారం, 19 అక్టోబరు 2015 (18:23 IST)

నవరాత్రులు: దుర్గాష్టమి రోజున దుర్గపూజ ఎలా చేయాలి?

నవరాత్రుల్లో ఎనిమిదో రోజున దుర్గాష్టమిని జరుపుకుంటాం. దుర్గాష్టమి నాడు దుర్గాదేవిని పూజిస్తే ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. నవరాత్రుల్లోని తొలి మూడు రోజులు దుర్గారూపాన్ని ఆరాధించి అరిషడ్వర్గాలను, తదుపరి మూడు రోజులు లక్ష్మీరూపాన్ని ఆరాధించి సిరిసంపదలను, చివరి మూడు రోజులలో సరస్వతి రూపాన్ని ఆరాధించి జ్ఞానాన్ని పొందాలని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.

కానీ మొదటి మూడు రోజుల్లో దుర్గాదేవి పూజించలేని భక్తులు దుర్గాష్టమి, విజయదశమి నాడు పూజ చేస్తే అష్టైశ్వర్యాలతో కూడిన సుఖజీవితం లభిస్తుంది. రాక్షసుడు మహిషాసురుడిని కాళికా దేవీ సంహరించినందుకు గుర్తుగా మనం ఈ నవరాత్రి వేడుకలు జరుపుకుంటాం. అలాగే దుర్గాదేవీ పూజను ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం.
 
ప్రాణ ప్రతిష్ట చేయు విధానం 
అమ్మవారి విగ్రహాన్ని పువ్వులతో అలంకరించి, పళ్లు, ఫలాలను సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత ప్రాణప్రతిష్ట చేసేందుకు పువ్వులు, అక్షింతలను పట్టుకుని అమ్మవారి పాదాలను పట్టుకుని కింది మంత్రములను పఠించాలి.
 
మం ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునఃప్రాణ మిహ నో ధేహి భోగమ్
జ్యోక్పశ్యేషు సూర్యముచ్చరంత మనుమతే మృడయా న స్స్వస్తి
అమృతంవై ప్రాణా అమృతమాపః
 
ప్రాణానేన యథాస్థాన ముపహ్వయతే
ఓం అం హ్రీం క్రీం హంస స్సోహం
 
స్వామిని శ్రీ జగన్నాథే యావత్పూజావసానకం
తాపత్వ్తం ప్రీతిభావేన యంత్రేస్మిన్ సన్నిధింకురు
రక్తాంభోదిస్థపోతోల్లస దరుణసరోజాధిరూఢా కరాభైః
పాశం కోదండ మిక్షూద్భవ మణిగుణ మప్యంకుశం పంచబాణాన్
భిభ్రామా సృక్కపాలం త్రిణయనవిలసత్ పీనవక్షోరుహాఢ్యా
దేవీబాలార్కవర్ణా భవతు సుఖకరీ ప్రాణశక్తిః పరానః
సాంగాం సాయుధాం సవాహనాం సశక్తిం పతిపుత్ర పరివార సమేతాం శ్రీవహాకాళీ
 
శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవీ అవాహితాభవ
స్థాపితాభవ సుప్రసన్నాభవ వరదాభవ స్థరాసనం కురు ప్రసీద ప్రసీద 
 
ధ్యానం 
లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాం
విద్యాప్రదాన సమయే శరదిందుశుభ్రాం
విద్వేషి వర్గవిజయేతు తమాలనీలాం
దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే
ఖడ్గం చక్రగదేషు చాపపరిఘాన్ శూలం భుశుండిం శిరః
శంఖం సందధతీంకరైః త్రిణయనాం సర్వాంగభూషాభృతాం
యాదేవీ మధుకైటభ ప్రశమనీ యామాహిషోన్మూలినీ
యాధూమ్రేక్షణ చండముండ దమనీ యారక్తబీజాశినీ
యాశుంభాది నిశుంభ దైత్యశమనీ యా సిద్ధలక్ష్మీఃవరా
తాంత్వాం చంద్ర కళావతంస మకుటాం చారుస్మితాం భావయే
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః
 
అక్షతలు, పుష్పములను దేవి పాదాల వద్ద ఉంచవలెను.
 
ఆసనం 
ఈ క్రింది మంత్రమును జపిస్తూ కొద్దిగా దేవిపై అక్షింతలు చల్లవలెను.
తాంమ ఆవాహ జాతదేవోలక్ష్మీ మనపగామినీం
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వరి పురుషానహం
దుర్గాదేవీ సమాగచ్ఛ సాన్నిధ్య మిహకల్పయ
బలిపూజాం గృహాణత్వమష్టాభిః శక్తిభ్స్సహ
 
తర్వాత దేవి పాదములపై దేవి పాదము వద్ద పుష్పముతో నీటిని చల్లవలెను. 
 
ఆచమనీయం 
ఈ క్రింది మంత్రము చెబుతూ గ్లాసులోని నీటిని పుష్పముతో కొద్దిగా దేవిపై చల్లవలెను
 
తాం పద్మినీంశరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేనశ్యతాం త్వాం వృణే
శరణాగతదీనార్త పరిత్రాణ పరాయణే
సర్వస్యార్తి హరేదేవీ నారాయణి నమోస్తుతే
 
పంచామృతాభిషేకం 
క్షీరం (పాలు)
ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్సోమ వృషియం
భవావాజస్య సంగధే
 
దధి (పెరుగు)
 
దధిక్రావుణ్ణో అకారిషం జిష్ణోరశ్వస్య వాజినః
సురభినో ముఖాకరత్పృణ ఆయూగంషి తారిషిత్
 
ఆజ్యం (నెయ్యి)
శుక్రమసి జ్యోతిరసి తేజోసి దెవోవస్సవితోత్పువా
త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్మిభిః
 
మధు (తేనె)
మధువాతా ఋతాయతే మధుక్షరన్తి సింధవః
మాధ్వీర్నస్సన్త్వౌ షధీః
 
చక్కెర (పంచదార)
స్వాదుః పవస్య దివ్యాయజన్మనే స్వాదురింద్రాయ సుహవీతునామ్నే 
స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగ్
 
ఫలోదకం (కొబ్బరి నీరు)
యాఃఫలినీర్యా ఫలా పుష్పా యాశ్చ పుష్పిణీః
బృహస్పచి ప్రసూతాస్తానో ముంచన్త్వగ్ హనః
 
శుద్ధోదకం (మంచినీరు) స్నానం
చివరగా అమ్మవారికి మంచినీటిలో స్నానం చేయించి పట్టు వస్త్రాలు సమర్పించుకోవాలి. తర్వాత పత్తితో చేసిన ఉపవీతం సమర్పించుకోవాలి. తర్వాత ఈ క్రింది మంత్రం చదువుతూ గంధం వేయవలెను
 
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః గంధాం ధారయామి
 
సుగంధ ద్రవ్యాణి 
ఓం అహిరివ భోగైః పర్యేతి బాహుం
జాయా హేతిం పరిబాధమానాః
హస్తేఘ్నో విశ్వావయునాని విద్వాన్
పుమాన్‌పుమాంసంపరిపాతువిశ్వతః
 
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః హరిద్రా కుంకుమ కజ్జల కస్తూరి గోరోజనాది సుగంధద్రవ్యాణి సమర్పయామి.
 
ఆభరణాణి (నగలు)
తర్వాత అమ్మవారికి ఈ క్రింది మంత్రం చెబుతూ నగలు సమర్పించుకోవాలి.
 
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః సర్వభరణాణి సమర్పయామి
 
పుష్పాణి (పూలమాలలు)
ఈ క్రింది మంత్రం చదువుతూ సుగంధ పూలమాలలను అలంకరించాలి. 
 
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి.
 
అధాంగ పూజ 
ఓం దుర్గాయై నమః పాదౌ పూజయామి
ఓం గిరిజాయై నమః గుల్ఫౌ పూజయామి
ఓం అపర్ణాయై నమః జానునీ పూజయామి
ఓం హరిప్రియాయై నమః ఊరూ పూజయామి
ఓం పార్వత్యై నమః కటిం పూజయామి
ఓం ఆర్యాయై నమః నాభిం పూజయామి
ఓం జగన్మాత్రే నమః ఉదరం పూజయామి
ఓం మంగళాయై నమః కుక్షిం పూజయామి
ఓం శివాయై నమః హృదయం పూజయామి
ఓం మహేశ్వర్యై నమః కంఠం పూజయామి
ఓం విశ్వవంద్యాయై నమః స్కంధౌ పూజయామి
ఓం కాళ్యై నమః బాహూ పూజయామి
ఓం ఆద్యాయై నమః హస్తౌ పూజయామి
ఓం వరదాయై నమః ముఖం పూజయామి
ఓం సువణ్యై నమః నాసికం పూజయామి
ఓం కమలాక్ష్యై నమః నేత్రే పూజయామి
ఓం అంబికాయై నమః శిరః పూజయామి
ఓం దేవ్యై నమః సర్వాణ్యం పూజయామి
 
ధూపం (అగరవత్తులు) 
తర్వాత అమ్మవారికి అగరవత్తులను సమర్పించుకోవాలి. 
 
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః ధూపమాఘ్రాపయామి.
 
దీపం 
అమ్మవారి దీపం వెలిగించి క్రింది మంత్రమును చదవాలి. 
 
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః దీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి
అని చెబుతూ నీటిని పళ్లెములో విడువలెను
 
నైవేద్యం 
తర్వాత నైవేద్యం సమర్పించి, తాంబూలాలను ఇవ్వాలి.
 
కర్పూరనీరాజనం
ఈ క్రింది మంత్రమును జపిస్తూ హారతి ఇవ్వవలెను.
 
సంతత శ్రీరస్తు, సమస్త మంగళాని భవంతు, నిత్యశ్రీరస్తు, నిత్యమంగళాని భవంతు
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః 
కర్పూర నీరాజనం సమర్పయామి.
 
మంత్రపుష్పమ్ 
చేతిలో అక్షింతలు, పువ్వులను ఉంచుకుని మంత్రపుష్పమ్ చెప్పవలెను. ఇక్కడ పెద్ద మంత్రపుష్పమ్ లేదా చిన్న మంత్రపుష్పమ్ చెప్పవలెను లేదా శ్రీ సూక్త ఫలమును పఠించవలెను. 
 
తర్వాత ఆత్మప్రదక్షిణ నమస్కారం చేయవలెను. అనంతరం తీర్థం పుచ్చుకుంటూ ఈ మంత్రాలను జపించవలెను.
 
మం అకాలమృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్తపాపక్షయకరం
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గాపరాదేవీ పాదోదకం పావనం శుభమ్
 
ఉద్వాసన 
ఈ క్రింది మంత్రము జపించుచూ ఉద్వాసన పలుకవలెను
మం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాస్తాని ధర్మాణి ప్రథమాన్యాసన్
తేహనాకం మహిమానస్సచంతే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః
 
శ్రీమహాకాళీ శ్రీమహాలక్ష్మీ శ్రీమహాసరస్వతీ స్వరూపిణీ శ్రీదుర్గా పరాదేవ్యై నమః యథాస్థాన ముద్వాసయామి.