ఈమెయిళ్ల జోరులో వన్నెతగ్గిన గ్రీటింగ్ కార్డులు

FILE
గుర్తుకొస్తున్నాయీ అంటూ వెంటాడే ఏడాది జ్ఞాపకాలకు ముగింపు పలుకుతూ కొత్త సంవత్సరానికి ప్రియమారా స్వాగతం పలికే గ్రీటింగ్ కార్డులు ఆధునిక టెక్నాలజీ ప్రభావ పలితంగా ఈ దఫా కాస్త కళ తప్పనున్నాయి. పాత బంగారంలాంటి గ్రీటింగ్ కార్డులకు ఈ ఏడాది అంతగా డిమాండ్ లేదని కార్డుల విక్రేతలు చెబుతున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలో గ్రీటింగ్ కార్డులకు డిమాండ్ కాస్త తగ్గుతుండగా అదే సమయంలో ఈమెయిళ్ల రూపంలో నూతన సంవత్సర శుభాకాంక్షల సందేశాలను పంపుకోవడం ఎక్కువయిందని జగదీష్ అనే గ్రీటింగ్ కార్డుల విక్రేత చెప్పారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం, ముంబై ఉగ్రవాద దాడులు కలిగించిన భీతావహ వాతావరణంలో నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలుపుకోవడానికి ఢిల్లీ వాసులు ఈ మెయిల్ సందేశాలు అనే కొత్త రూపానికి మళ్లారని అన్నారు.

క్రిస్‌మస్ పండుగను, నూతన సంవత్సర సంబరాలను జరుపుకోవడానికి ఈమెయిళ్లు కొత్త సందేశ వేదికగా మారాయి. కొత్త సంవత్సరం వస్తోందంటే పండుగ వాతావరణంతో కళకళలాడుతూ ఉండే ఢిల్లీలో ఈసారి దేదీప్యమానంగా వెలిగై లైట్లు, కార్డులు, బహుమతులు వంటి వాటికి జనం కాస్త దూరంగా ఉన్నారు.

సంవత్సరం పొడవునా విషాదాలను చవిచూసిన అనుభవంతో ఢిల్లీ వాసులు వీలైనంతగా నిరాడంబరత్వాన్ని పాటిస్తున్నారని, వారి ఆకాంక్షలకు ప్రతిరూపంగా అన్నట్లు, నగరంలోని పైవ్‌స్టార్ హోటళ్లు సైతం ఈసారి మిరుమిట్లు గొలిపే అలంకరణలను కాస్త తగ్గించాయి.

ఈసారి మేం కార్డులను పంచుకోవాలని భావించడం లేదని, సంవత్సరానికి సరిపడా విషాదాన్ని అనుభవించిన తాము పండుగ వాతావరణం మధ్యన లేమని ఢిల్లీకి చెందిన 25 ఏళ్ల ఇంగ్లీష్ సాహిత్య విద్యార్థి రోమిలా చెప్పారు.

Raju|
మార్కెట్లో మాంద్యం ఫలితంగా ఈ ఏడు గ్రీటింగ్ కార్డుల వ్యాపారం 35 శాతం మేరకు క్షీణించిందని హెల్పేజ్ ఇండియా మేనేజర్ నందితా తెలిపారు. చివరకు పెద్దమొత్తంలో ఉద్యోగులకు గ్రీటింగ్ కార్డులను అందించే కార్పొరేట్ సంస్థలు కూడా ఈసారి తమ ఆర్డర్లను బాగా తగ్గించివేశాయని ఆమె చెప్పారు.


దీనిపై మరింత చదవండి :