జాతీయ పండుగగా న్యూ ఇయర్

FILE
భారత దేశంలో రానురాను నూతన సంవత్సరం అనేది జాతీయ పండుగగా మారుతోంది. నూతన సంవత్సర సంబరాలను జరుపుకోడానికి దేశం నలుమూలలా ప్రజలు ఉద్వేగంగా ఎదురు చూస్తుంటారంటే ఆశ్చర్యపోవలసింది లేదు. మతాతీతంగా, కులాతీతంగా, వర్గాతీతంగా భారత్‌లో సకల జనులూ జరుపుకునే ఏకైక పండుగా నూతన సంవత్సర వేడుకలు ఏడాదికేడాదికి కొత్త రూపును ధరిస్తున్నాయి.

పాతకు వీడ్కోలు చెప్పి కొత్తకు స్వాగతం పలికే తొలి పండుగగా న్యూ ఇయర్ భారత ప్రజలను ప్రస్తుతం ఏకం చేస్తోంది. పాత సంవత్సరం ముగిసిపోయే క్షణాలను పార్టీలు చేసుకోవడం ద్వారా, సరదాగా గడపడం ద్వారా, రోడ్లమీద పరుగులు తీయడం ద్వారా, నృత్యాల ద్వారా, రాత్రంతా మేలుకోవడం ద్వారా జనం సందడి సందడిగా మెలగటం కద్దు.

సంవత్సరం చివరిరోజు మధ్యాహ్నం నుంచే మొదలయ్యే నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రజలు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో గడుపుతూ ఆ అపరూప క్షణాలను సంవత్సరం పొడవునా మదిలో దాచుకుంటుంటారు.

Raju| Last Modified బుధవారం, 31 డిశెంబరు 2008 (21:12 IST)
డిసెంబర్ 31 రాత్రి దేశంలోని నైట్ క్లబ్బులు, డిస్కోథెక్‌లు, వినోద భరిత పార్కులు, చివరకు సినిమా హాళ్లు సైతం అన్ని రకాల వయస్కుల వారితో కిటకిటలాడుతుంటాయి. ఈ సామూహిక కలయికలకు ఒకే నిర్వచనం మరి. పాతకు వీడ్కోలు, కొత్తకు స్వాగతాలు..


దీనిపై మరింత చదవండి :