నూతన సంవత్సరం సందర్భంగా కేవలం ఈ సంబరం జరుపుకోవడానికే ఉద్దేశించిన ప్రత్యేక, రంగుల దుస్తులలో జనం కనిపించడం ఎక్కువైంది. కలర్ కోడ్ కానివ్వండి, మ్యాచింగ్ డ్రెస్ కానివ్వండి.. థీమ్ డ్రెస్సింగ్ అనేది కొత్త సంవత్సర మూడ్‌ను రానురాను ప్రజలలో వ్యాప్తి చేస్తూ సంవత్సరం తొలిరోజును విశిష్ట డ్రెస్ కోడ్‌ల మయంగా చేయడం ఇటీవలి సంవత్సరాలలో పెరిగింది.