2008 సంవత్సరం పాతబడిపోయింది. కొత్త సంవత్సరంగా 2009 కాలచక్రంలో ముందు నిలిచింది. పాత సంవత్సరం మధుర జ్ఞాపకాలకంటే పీడకలలను, దుస్సంఘటనలను ఎక్కువగా గుర్తుకు తెస్తూ ముగిసింది. ఉగ్రవాదం విసిరిన పంజా దెబ్బకు ముంబై, ఇస్లామాబాద్‌లో జనజీవితం స్తంభించిపోవడం ఓ వాస్తవం కాగా మరోవైపు చైనాలో భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలు లక్షలాది మంది ప్రాణాలను హరించాయి. ఇకపోతే వీటన్నిటికంటే మించి, ప్రపంచవ్యాప్తంగా జనజీవితాలను కల్లోలపర్చిన మార్కెట్ల పతనం కళ్లముందు కదులాడుతూనే ఉంది.