మొబైల్‌తో ఆత్మీయ సందేశాలు

FILE
అరచేతిలో ప్రపంచం చూపే మొబైల్ ఫోన్‌తో నగరాల్లో యువత ఇప్పుడు ఆప్తులకు చకచకా శుభాకాంక్షల సందేశాల మోత మోగిస్తోంది. న్యూఇయర్ సంబరాలకు ప్రతిరూపంగా ఉండే గ్రీటింగ్ కార్డుల తయారీ పరిశ్రమలు ప్రస్తుతం ఎస్ఎమ్ఎస్ సందేశాల ఒరవడికి మూతపడుతున్నాయి.

అదే సమయంలో మొబైల్ నెట్ ‌వర్క్ కంపెనీలు పోటాపోటీగా ఎస్టీడీ, ఐఎస్డీ, ఎస్ఎమ్ఎస్ ఛార్జీలను తగ్గిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్ నాటికి దేశంలో 67 లక్షల మందికి పైగా మొబైల్ వినియోగదారులు ఉన్నారని భారతీయ మొబైల్ ఆపరేటర్ల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో చాలామంది ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఉన్న తమ బంధుమిత్రులకు పండుగ సమయాల్లో గ్రీటింగ్ కార్డులు పంపడానికి బదులు సెల్‌ఫోన్ కాల్స్ లేదా ఎస్ఎమ్ఎస్‌ల ద్వారా శుభాకాంక్షలు చెబుతున్నారు.

Raju| Last Modified బుధవారం, 31 డిశెంబరు 2008 (21:13 IST)
ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నయ్ హైదరాబాద్, బెంగళూరు.. ఇలా దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాలు మొత్తంగా మొబైల్ సందేశాల ద్వారా నూతన సంవత్సర శుభాకాంక్షలు పంపే ధోరణి శరవేగంగా పాకుతోంది. దేశవ్యాప్తంగా మూతపడుతున్న గ్రీటింగ్ కార్డుల కంపెనీలే ఇందుకు తిరుగులేని సాక్ష్యం మరి.


దీనిపై మరింత చదవండి :