అంతర్జాతీయ వైద్య సమాఖ్య అధ్యక్షుడిగా గౌతమ్

Man
Ganesh|
FILE
ప్రవాస భారతీయ వైద్యుడు గౌతమ్ బొడివాలా "అధ్యక్షుడి"గా ఎంపికయ్యారు. లీసెస్టర్ వర్సిటీలో వైద్య అధ్యాపకుడిగా పనిచేస్తున్న గౌతమ్ ఈ వైద్య సమాఖ్యను 1991 సంవత్సరంలో స్థాపించారు.

గౌతమ్ నాయకత్వంలో మొదట ఎనిమిది జాతీయ సంఘాలతో మొదలైన ఈ సమాఖ్య సభ్యత్వం నేడు నలభై సంఘాలకు పెరిగింది. కాగా.. ఈ అత్యవసర వైద్య సమాఖ్యకు తొలిసారిగా నిర్వహించిన ఎన్నికల్లో వ్యవస్థాపకుడైన గౌతమ్ అధ్యక్షుడిగా ఎంపికవటం విశేషంగా చెప్పవచ్చు.

ఈ సందర్భంగా గౌతమ్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని ప్రతి పౌరుడికీ అత్యవసర వైద్య సేవలు అవసరమవుతుంటాయనీ, తమ ఫౌండేషన్ ద్వారా అంతర్జాతీయంగా అత్యవసర వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేగాకుండా ఈ వైద్య సేవలలో పాల్గొనే వైద్యుల మధ్య పరస్పర సంబంధాలను, సహకారాన్ని కూడా ఆయన వివరించారు.


దీనిపై మరింత చదవండి :