అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయనున్న కేంద్రం

illegal immigration
Ganesh|
FILE
విదేశాలకు అక్రమ వలసలను అరికట్టేందుకుగానూ ఏడంచెల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా కేంద్ర ప్రవాస వ్యవహారాల శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలతో రెండు రోజులపాటు నిర్వహించిన సంప్రదింపుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ప్రవాస భారతీయులు, చట్టబద్ధ వలసదారుల ప్రయోజనాలు కాపాడే విధంగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయని ప్రవాస వ్యవహారాల శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ సమావేశం ప్రకారం... క్రింది స్థాయిలోనే మోసాలను అరికట్టే విధంగా తగు చర్యలను చేపడతామనీ... మధ్యవర్తులు, ఏజెంట్లపై జిల్లా పోలీస్ యంత్రాంగం ద్వారా నిఘా పెట్టి, మోసాలకు పాల్పడే ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆ శాఖ వివరించింది.

అలాగే పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను విమానాశ్రయాలు, జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల వద్ద ఉంచుతారనీ ప్రవాస వ్యవహారాల శాఖ ప్రకటన పేర్కొంది. ఆ విధంగా పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా కోర్ గ్రూపును కూడా ఏర్పాటు చేయనున్నారు. కాగా.. ఇదే సందర్భంగా.. 2010లో జరుగనున్న ప్రవాసీ భారతీయ దివస్‌లో పాల్గొనాల్సిందిగా ఆయా రాష్ట్రాలకు ఈ శాఖ ఆహ్వానం పలికింది.


దీనిపై మరింత చదవండి :