అమితవ్ ఘోష్‌కు ప్రతిష్టాత్మక "డాన్ డేవిడ్" ప్రైజ్..!!

Nri News
Ganesh|
FILE
ప్రముఖ భారత రచయిత అమితవ్ ఘోష్ ప్రతిష్టాత్మక "డాన్ డేవిడ్ ప్రైజ్"‌కు ఎంపికయ్యారు. వెస్ట్రన్ నవలా రచనా ప్రక్రియలో తనదైన శైలితో పాఠకులకు ఆకట్టుకుంటున్న అమితవ్, ఈ రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా డాన్ డేవిడ్ అవార్డును కైవసం చేసుకున్నారు.

టెల్ అవివ్ యూనివర్సిటీ వద్దగల డాన్ డేవిడ్ ఫౌండేషన్ మరియు హెడ్‌క్వార్టర్స్‌వారు ఈ డాన్ డేవిడ్ అవార్డును అందజేస్తున్నారు. ఈ అవార్డు అందుకొన్నవారికి ఒక మిలియన్ డాలర్లను బహుమతిగా ఇస్తారు. ప్రతి సంవత్సరం ఈ అవార్డును ఆర్కియాలజీ, ఆర్ట్స్ అండ్ మెటీరియల్ సైన్స్ అనే మూడు ప్రత్యేక విభాగాల కింద ప్రదానం చేస్తారు.

ఇదిలా ఉంటే.. 53 సంవత్సరాల అమితవ్ ఘోష్ డాన్ డేవిడ్ ఫ్రైజ్‌ను గెల్చుకున్న మూడో భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. గతంలో సీఎన్‌ఆర్ రావ్ మరియు సంగీత విద్వాంసుడు జుబిన్ మెహతా‌లు ఈ అవార్డును గెల్చుకున్నవారిలో ఉన్నారు. కాగా.. ఈ ఏడాది డాన్ డేవిడ్ ప్రైజ్‌ను అమితవ్ ఘోష్ డాక్టర్ గోర్డన్ ఇ మోర్‌తో కలిసి సంయుక్తంగా అందుకోనున్నారు.


దీనిపై మరింత చదవండి :