అమెరికాలో "కాశ్మీర్ హిందూ ఫౌండేషన్"

Ganesh|
అమెరికాలో కాశ్మీర్ హిందూ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసినట్లు.. ఆ సంస్థ నిర్వాహకులు వెల్లడించారు. భారతదేశం వెలుపల ఏర్పాటయిన తొలి కాశ్మీర్ పండిట్ల సంఘం ఇదేననీ... తమ ప్రయోజనాలను కాపాడుకోవటం, అవసరాలను తీర్చుకోవటం కోసం ప్రవాస కాశ్మీరీ పండిట్లు ఈ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారని నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కాశ్మీర్ హిందూ ఫౌండేషన్‌కు చెందిన అంకిత్ మోగ్రా మాట్లాడుతూ... కాశ్మీరీ పండిట్ల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు అవసరమైన సాంస్కృతిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ కాశ్మీర్ హిందూ ఫౌండేషన్ పనిచేస్తుందని నిర్వాహకులు తెలియజేశారు.

అలాగే కాశ్మీర్ హిందూ సంస్కృతిని భావితరాలకు అందించే విధంగా దానిని తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు కూడా నిర్వాహకులు తెలిపారు. అలాగే, ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రవాస కాశ్మీర్ పండిట్లను ఒక గొడుగు కిందకు తెచ్చేందుకు కూడా ఈ ఫౌండేషన్ కృషి చేస్తుందని నిర్వాహకులు చెప్పారు.


దీనిపై మరింత చదవండి :